దేశాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి కరోనావైరస్ పై జరుపుతున్న పోరాటంలో భాగంగా ఆరోగ్యసేతు అనే యాప్ ను కేంద్రప్రభుత్వం రూపొందించిన సంగతి తెలిసిందే. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ యాప్ ను కొన్ని లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. మీ ఫోన్ బ్లూటూత్, లొకేషన్, మీ మొబైల్ నంబర్ ఆధారంగా మీరు కరోనావైరస్ బారిన పడిన వారిని కలిశారో లేదో తెలుపుతుంది. దీన్ని ఇంగ్లిష్, హిందీ, గుజరాతీ, కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం, ఒడియా, పంజాబీ, మరాఠీ భాషల్లో ఈ యాప్ ను ఉపయోగించుకోవచ్చు.

 

తాజాగా  దేశ రాజధాని ఢిల్లీలోకి ప్రవేశించే ముందు ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందేనన్న కఠిన నిబంధనను అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.  మీరు ఎవరెవరిని కలిశారో, ఏయే ప్రాంతాలకు వెళ్లారో ఈ యాప్ సూచిస్తుంది. తద్వారా ఇంకా ఎవరెవరికి కరోనా సోకే అవకాశం ఉంటుందో గుర్తించడం తేలికవుతుంది. ఈ యాప్ ప్రతి రోజూ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. అంటే... దగ్గు ఉందా, జలుబు ఉందా, గొంతు నొప్పిగా ఉందా వంటి ప్రశ్నలు. వాటికి మీరు ఇచ్చే సమాధానాన్ని బట్టీ... మీకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయో లేదో ఈ యాప్ గుర్తిస్తుంది.

 

ఢిల్లీలోకి ప్రవేశించే వారందరు కూడా కేంద్రం ప్రతిపాదించిన ‘ఆరోగ్య సేతు’ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందేనని కఠిన నిబంధన విధించనున్నట్లు సమాచారం. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఇప్పటికే సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. అంతే కాదు ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న వారికే ఢిల్లీలో ప్రవేశం కల్పించాలని ‘నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ సుర్జీత్ కుమార్ ఢిల్లీ ప్రభుత్వానికి సూచించారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: