ప్రపంచం మొత్తం కరోనా  వైరస్ తో యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.కంటికి  కనిపించని శత్రువును తరిమి కొట్టేందుకు సర్వశక్తులూ ఒడ్డి ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా  వైరస్ మాత్రం కొన్ని చోట్ల కంట్రోల్ కావడం లేదు. క్రమక్రమంగా పెరిగిపోతున్న కరోనా  వైరస్ కేసుల దృశ్య ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఈ వైరస్ వెలుగులోకి వచ్చి  నెలలు గడుస్తున్నప్పటికీ సరైన వాక్సిన్  కూడా అందుబాటులోకి లేకపోవడంతో మరింత భయాందోళనకు గురవుతున్నారు ప్రపంచ ప్రజానికం. ఈ నేపథ్యంలో రోజురోజుకు మహమ్మారి వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగి పోతూనే ఉంది. 

 

 

 అయితే ఆసియాలోనే అతి పెద్ద మురికి వాడ అయినా ధారవి లో కరోనా  వైరస్ విలయ తాండవం చేసిన విషయం తెలిసిందే. మురికివాడ కావటం పరిసరాల పరిశుభ్రత లేకపోవటము..ఇరుకైన ఇళ్లల్లో ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఉండటం...  ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో అక్కడ కరోనా  వైరస్ విలయతాండవం చేసింది. దీంతో ఎంతోమంది పేద ప్రజలు కరోనా  వైరస్ బారినపడి మృత్యువుతో పోరాడుతున్నారు . అక్కడి ప్రభుత్వాలు కూడా క్రమక్రమంగా ధారవి  ప్రజల్లో అవగాహన తీసుకు రావడంతో ప్రస్తుతం ప్రజలందరూ పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ కరోనా  వైరస్ బారిన పడకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. 

 

 

 దీంతో క్రమక్రమంగా ఆసియాలోనే అతి పెద్ద మురికి వాడ అయిన దారవి లో కరోనా కేసుల  సంఖ్య తగ్గిపోతుంది. మొన్నటివరకు విజృంభించిన కరోనా ప్రస్తుతం  పూర్తిగా తగ్గిపోతుంది. 24 గంటల్లో కేవలం ఆరు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు కావడంతో అక్కడి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం మాత్రమే 25 కేసులు నమోదైనట్లు అక్కడి వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2.1 స్క్వేర్ కిలోమీటర్లలో ఉండే దారవిలో  8 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇరుకు ఇళ్లల్లో నే కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో మొన్నటివరకు శరవేగంగా కరోనా  వైరస్ వ్యాప్తి  చెందిది కానీ అక్కడి అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా వైరస్ ప్రభావం తగ్గింది.

మరింత సమాచారం తెలుసుకోండి: