కరోనా వైరస్ దెబ్బకి పత్రిక రంగాలు కూడా ప్రమాదకరం లోకి వెళ్లి పోయాయి. టెక్నాలజీ రావడంతో చాలా వరకు ప్రింట్ మీడియా తీవ్రమైన నష్టాల్లోకి వెళ్ళిపోయింది. 3g, 4g టెక్నాలజీ రావటంతో ప్రపంచంలో జరిగే వార్తలు నిమిషాల్లోనే లైవ్ లోనే కనబడుతున్న తరుణంలో వార్తాపత్రికలను జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. టెక్నాలజీ రాకముందు వరకు ప్రింట్ మీడియా కి ఇలాంటి డోకా లేదు. కానీ ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ మీడియా ఆ తర్వాత సోషల్ మీడియా రావటం జరిగిందో జనాలు పత్రికలను చదవడం మానేశారు.

 

దీంతో పత్రికా యాజమాన్యాలు చాలా మంది ఉద్యోగస్తులను ఉద్యోగాల నుండి సడన్ గా తీసేస్తున్నాయి. జర్నలిస్టులు ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే చాలావరకు ప్రముఖ పత్రికలు దుకాణం సర్దేశాయి. కొన్ని రాజకీయ పార్టీల ద్వారా నడిచే పత్రికలు అయితే కరోనా వైరస్ దెబ్బకి ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో పేజీలు తగ్గించి ప్రింట్ చేస్తున్నాయి. ఆఖరికి జర్నలిస్టు రంగానికి చెందిన అధ్యక్షుల పత్రిక కూడా ఇటీవల ఒకటి మూత పడిపోయింది.

 

దీంతో చాలా మంది జర్నలిస్టులు మరియు పత్రికా రంగాన్ని నడిపే యాజమాన్యాలు ప్రభుత్వాలు ప్రింట్ మీడియా ని కాపాడటానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రస్తుతం కిందా మీదా పడుతూ ఏదోవిధంగా నెట్టుకొస్తున్న పత్రికా యాజమాన్యాలు కరోనా దెబ్బకి కొద్దిపాటి జీతాల లో కటింగ్ చేస్తూ ఉద్యోగస్తులను మెల్లగా నడిపిస్తున్నాయి. భవిష్యత్తు బట్టి చూస్తే ప్రింట్ మీడియా పని అయిపోయిందని అంటున్నారు. దీంతో చాలామంది జర్నలిస్టు సంఘాలు పత్రికా యాజమాన్యాలు ప్రింట్ మీడియా ని కాపాడటానికి ప్రభుత్వాలు ఏదైనా నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: