తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి చేయడంలో ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఇదే సమయంలో ప్రత్యర్థులు చేసే ఆరోపణలను తనదైన శైలిలో తీపికోడుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి కనబడటం లేదు. ఒక పక్క రాష్ట్రంలో చాపకింద నీరులా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోవడం మరోపక్క ప్రతిపక్షాలు భయంకరంగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం అందరికీ కనబడుతున్నాయి. ఇటువంటి సమయంలో వైద్య శాఖ మంత్రిగా ఉన్న ఆళ్ల నాని నుండి సరైన రెస్పాండ్ రాకపోవటం వైసీపీ నేతలకు విసుగు తెప్పిస్తుంది.

 

వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటూ ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు పెడుతూ తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ లాగా వ్యవహరించాలని ఎప్పటినుండో ఆళ్ల నాని పై ఒత్తిడి వస్తోంది. అలాంటి టైమ్ లో సమాచార శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న పేర్ని నాని ఇప్పటివరకు కరోనా వైరస్ కట్టడి చేయడంలో ప్రభుత్వం తరుపున మాట్లాడటం జరిగింది. ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను తిప్పి కొడుతూ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తూ మొన్నటి వరకూ సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షమయ్యారు పేర్ని నాని.

 

అయితే ఇటీవల వైసిపి పార్టీ హైకమాండ్ పేర్ని నాని ని ప్రభుత్వం తరఫున కరోనా వైరస్ గురించి మీడియా ముందు ఏమి మాట్లాడకూడదు అని సూచించినట్లు వైసీపీ పార్టీలో టాక్. ఇందువల్లే గత కొన్ని రోజుల నుండి కరోనా వైరస్ కట్టడి చేయడం విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న పనితీరు గురించి ఎవరూ మాట్లాడటం లేదని ఏపీ రాజకీయాల్లో టాక్. కాగా పేర్ని నాని నీ మాట్లాడకూడదని హైకమాండ్ చెప్పినట్లు వచ్చిన వార్త బయటకు రావడంతో వైసిపి పార్టీ మద్దతుదారులు పార్టీ హైకమాండ్  'సరైనోడు' ని మిస్ చేసుకుంటుందని అంటున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: