టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదు అనే విషయం మరోసారి రుజువు అవుతోంది. ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్ తన సొంత నివాసంలో ఉంటున్నారు. అక్కడి నుంచే ఏపీ రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. అడుగడుగునా ఏపీ ప్రభుత్వం పని తీరును తప్పుబడుతూ విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ పనితీరు సక్రమంగా లేదని, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవడం లేదని, ప్రజలు కరోనా కారణంగా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమయంలో ప్రజలకు భరోసా ఇవ్వవలసిన ఎమ్మెల్యేలు తమ సొంత ప్రచారం కోసం పాకులాడుతూ, ప్రజలను పట్టించుకోవడం లేదంటూ ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు వేరేగా ఉన్నాయి. 

 

IHG

ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ సొంత డబ్బులతో నిత్యావసర సరుకులు, పండ్లు ,కూరగాయలతో పాటు విటమిన్ టాబ్లెట్లు పంపిణీ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం అందించే సహాయం కూడా తమ చేతుల మీదగా ప్రజలకు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా   టిడిపి అధినేత చంద్రబాబు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రజలను ఇప్పటివరకు పట్టించుకున్న దాఖలు లేదు అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాదులో ఉండిపోయినా, ఆయన స్థానిక నాయకుల ద్వారా ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు పంపిణీ చేసే అవకాశం ఉన్నా... ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. దీనిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 

 

 

చంద్రబాబు 30 ఏళ్లుగా తమకు ఎమ్మెల్యేగా ఉన్నారని, కానీ కష్ట సమయంలో మాత్రం నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని, అప్పుడప్పుడు వచ్చి చుట్టం చూపుగా వస్తున్నారు అంటూ ఆ నియోజకవర్గ ప్రజలు వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు స్వయంగా కుప్పం నియోజకవర్గం లోకి అడుగు పెట్టే అవకాశం లేకపోయినా,  పార్టీ నాయకుల ద్వారా ప్రజలకు సహాయం చేసే అవకాశం ఉన్నా, పట్టించుకోవడంలేదని, అసలు తాను కుప్పం నియోజకవర్గ  ఎమ్మెల్యే అన్న విషయాన్ని చంద్రబాబు మరిచిపోయాడు అంటూ అక్కడి ప్రజలు తీవ్ర స్థాయిలో చంద్రబాబు తీరుపై మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: