దేశ వ్యాప్తంగా అమ‌లవుతున్న లాక్‌డౌన్‌పై కేంద్ర ప్ర‌భుత్వం  ష‌ర‌తుల‌తో కూడిన స‌డ‌లింపులు చేసిన విష‌యం తెలిసిందే. శుక్ర‌వారం అర్ధ‌రాత్రి ఏకంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ఉత్త‌ర్వుల ప్ర‌కారం..క‌రోనా కేసులు న‌మోదు కాని ప్రాంతాల్లో దుకాణాల‌ను తెరిచి ఉంచేందుకు అవ‌కాశం క‌ల్పించింది. అలాగే స‌గంమంది సిబ్బందితో దుకాణాల నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తుల‌ను జారీ చేసింది. అయితే సామాజిక దూరం పాటించేలా చూడాల‌ని ఉత్త‌ర్వుల‌ను ఆదేశించింది.రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉందని, అందుకే కేంద్ర ప్రభుత్వ సడలింపులను ఢిల్లీలో అమలు చేయబోమని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. 


 కేంద్ర‌ప్ర‌భుత్వం తీసుకున్న తాజా నిర్ణ‌యాన్ని ఢిల్లీ రాష్ట్ర‌ ప్ర‌భుత్వం త‌ప్పుబ‌ట్టింది. సీఎం కేజ్రీవాల్ ఏకంగా కేంద్రం నిర్ణ‌యం పూర్తిగా రాష్ట్రాన్ని ప్ర‌మాదంలో ప‌డేసేలా ఉంద‌ని వ్యాఖ్య‌నించ‌డం గ‌మ‌నార్హం. ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తుంటే.. ఆంక్షలు సడలిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం సరైనది కాదని కేజ్రీవాల్‌ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో వైరస్‌ వ్యాప్తి ఇంకా అదుపులోకి రానందున దుకాణాలనుతెర‌వ‌వ‌ద్ద‌ని ఆయ‌న తెలిపారు. ఈమేర‌కు అధికారులు ప‌ర్య‌వేక్షించేలా ఆదేశించారు. అయితే రాష్ట్రంలో లాక్‌డౌన్ స‌డ‌లింపు విష‌యంపై 27న ప్ర‌ధాన‌మంత్రితో వీడియో కాన్ఫ‌రెన్స్‌లో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు తెలిపారు.


ఇదిలా ఉండ‌గా ఢిల్లీలో కరోనా పాజటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. కొత్త కేసుల న‌మోదు సంఖ్య ఎక్కువ‌గా ఉండ‌టం.. రిక‌వ‌రీల సంఖ్య త‌క్కువ‌గా ఉండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ముంబై త‌ర్వాత అత్య‌ధిక కేసులు న‌మోదవుతున్న రాష్ట్రం ఢిల్లీయే కావ‌డం గ‌మ‌నార్హం.  ఇపట్పి వరకు ఢిల్లీలో కేసుల సంఖ్య 2,514కి చేరింది. ఢిల్లీలో 92కు పైగా కరోనా హాట్‌స్పాట్‌ జోన్లను ఏర్పాటు చేశారు. గ్రీన్‌ జోన్‌ ప్రాంతాల్లో కూడా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్‌ అలర్ట్‌ ప్రకటించింది.నివారం సాయంత్రం 5 గంట‌ల‌ వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 24,942 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: