భూమి మీద మనిషి జాతిని ప్రమాదంలోకి నెట్టేసింది కరోనా వైరస్. దీంతో ప్రపంచ దేశాలు కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం చైనా, అమెరికా, ఇజ్రాయిల్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలు తీవ్ర స్థాయిలో పరిశోధనలు చేస్తున్నాయి. అలాగే భారత్ మరియు 20 దేశాలు కూడా పరిశోధనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమెరికా మానవులపై ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపింది. ఇదే టైమ్ లో ఆస్ట్రేలియా కూడా ఏకంగా 2 వ్యాక్సిన్లు అందుబాటులో కి రాబోతున్నట్లు ట్రయల్స్ మొదలైనట్లు చెప్పుకొచ్చింది.

 

 

ఇలాంటి సమయంలో ప్లాస్మా థెరఫీ ట్రీట్మెంట్ చేస్తే  కరోనా రోగులని కాపాడవచ్చు అని భారత వైద్యులు అంటున్నారు. ఇటీవల మన దేశానికి చెందిన వైద్య పరిశోధన మండలి ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. దీంతో వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్లాస్మా థెరఫీకి అనుతినిచ్చింది. ప్రయోగాత్మకంగా ముంబైలో దీనిని నిర్వహించాలని సూచించింది. అయితే క్షేత్ర స్థాయిలో ప్లాస్మా దాతలు దొరక్కపోవడం వల్ల ఈ చికిత్సా విధానం ముందుకు కదలటం లేదు.

 

 

ఒకవేళ ఈ ట్రీట్మెంట్ వర్కౌట్ అయితే దేశానికి తిరుగుండదు. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి రక్తం ద్వారా ప్లాస్మాను సేకరిస్తారు. దాన్ని మరొక రోగికి ఎక్కిస్తారు. దీనిలో యాంటీ బాడీస్ పేషెంట్ తొందరగా కోలుకోవడానికి తోడ్పడుతుందని వైద్యులు అంటున్నారు. అయితే ఈ సమయంలో కరోనా వైరస్ నుండి కోలుకున్న పేషెంట్లు బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రావటం లేదు. ప్రస్తుతం ముంబయిలో కరోనా వైరస్ నుండి 500 మంది కోలుకో వటం జరిగింది. కనీసం పదిమంది కూడా ముందుకు రాలేదు. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: