దేశంలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలకు  ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటీ)ని పంపించిన విషయం తెలిసిందే. ఈ బృందాలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై తీసుకుంటున్న చర్యలని, కరోనా ప్రభావం ఎలా ఉందనే దానిపై అధ్యయనం చేసి కేంద్రానికి పంపించనున్నాయి.

 

ఇప్పటికే ఈ బృందాలు పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాయి. ఈ క్రమంలోనే వీరు పశ్చిమ బెంగాల్ కూడా వెళ్లారు. కానీ అక్కడ వీరికి మమత ప్రభుత్వం ఏ మాత్రం సహకరించడం లేదు. ఇదే విషయాన్ని కేంద్ర బృందం చెబుతుంది. ప్రభుత్వం సరైన సహకారం కానీ, అవసరమైన భద్రత కానీ కల్పించలేదని పశ్చిమబెంగాల్ చీఫ్ సెక్రటరీ రాజీవ్ సిన్హాకు ఐఎంసీటీ లేఖ రాసింది.

 

అయితే ఈ బృదాన్ని పంపిస్తున్నప్పుడే మమత వ్యతిరేకించారు. వారు ఎందుకు వస్తున్నారో పూర్తి కారణం చెప్పాలని, మోదీ, అమిత్ షాలని డిమాండ్ చేసారు. వీరి రాక వెనుక ఎదో రాజకీయ కారణముందని కూడా ఆరోపించారు. అందుకే ఇప్పుడు ఐఎంసీటీ బృందం వచ్చిన, తర్వాత వారికి ఎలాంటి సహకారం అందించడం లేదు. పైగా వీరు రాజకీయ వైరస్ ని పెంచేందుకు వచ్చారంటూ తృణమూల్ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ డైరక్ట్ గా విమర్శలు చేస్తున్నారు.

 

వారి పర్యటనతో ఒరిగిందేమీ లేదని, హాట్‌స్పాట్ గా ప్రకటించని జిల్లాల్లో పర్యటించారని, వారి పర్యటన వెనకున్న నిజమైన ఉద్దేశ్యం... రాజకీయ వైరస్‌ను వ్యాప్తి చేయడమే అని మండిపడ్డారు. అయితే ఇలాంటి టైం లో రాజకీయం చేయాలని ఎవరు అనుకోరు. మోదీ ప్రభుత్వం కూడా రాజకీయంగా వెళ్లకుండా అందరిని కలుపుని పోతూ కరోనాని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

కానీ మమత మాత్రం, మోదీకి ఎలాగో వ్యతిరేకం కాబట్టి, ఇప్పుడు కూడా అదే యాంగిల్ లో ఆలోచిస్తూ, కేంద్రం తీసుకుంటున్న చర్యలకు అడ్డుపడుతున్నారు. మిగతా రాష్ట్రాల సీఎంలకు లేని ఇబ్బంది మమతకు ఒక్కరికే వచ్చినట్లు కనిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: