రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా ఎంత పెరుగుతుందో అంతే స్థాయిలో ఏపీలో దానిపై రాజకీయం జరుగుతుంది. అక్కడ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయిలో జరుగుతుంది. కాకపోతే ఏపీతో పోలిస్తే, తెలంగాణాలో కరోనా మీద పెద్దగా రాజకీయాలు జరగడం లేదు. ఇక్కడ ప్రతిపక్షాలు, కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువగా చేయడం లేదు.

 

ఈ క్రమంలోనే ఒక్కసారిగా కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్స్ రేవంత్ రెడ్డి, విజయశాంతిలు కేసీఆర్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు.  కరోనా వైరస్‌ బాధితులకు వైద్యం అందిస్తున్న గాంధీ ఆసుపత్రి జైలు మాదిరిగా ఉందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీ ఒవైసీ అంటున్నారని, అయితే అంతకముందు గాంధీ ఆస్పత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేవని రాసిన మీడియా యజమానికి కరోనా వైరస్‌ సోకాలని కేసీఆర్ శాపం పెట్టారని, దాని గురించి ఒవైసీకి పెద్దగా తెలియదు అనుకుంటా అని వెటకారంగా మాట్లాడారు. అంటే కేసీఆర్ ప్రభుత్వంలో కూడా వైఫల్యం ఉందనే విషయాన్ని పరోక్షంగా విజయశాంతి ఎత్తి చూపించారు.

 

ఇదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా సలహాలు ఇస్తున్నట్లు ఇస్తూనే, కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు వచ్చే నిధుల్లో పారదర్శకత లేదని,కరోనాకు ప్రభుత్వం చేసిన ఖర్చు.. 2వేల కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చినవేనని చెబుతున్నారు. అలాగే కేరళ సీఎం పినరయి ప్రతిపక్షనేతతో కలిసి కరోనాపై సమీక్షలు చేస్తున్నారని, సీఎం కేసీఆర్ ప్రతిపక్షాల సలహాలు ఎందుకు తీసుకోరు? అని ప్రశ్నించారు.

 

అయితే రేవంత్ తమని కూడా పరిగణలోకి తీసుకోమని కేసీఆర్ కు పరోక్షంగా సలహా ఇస్తున్నారు. కానీ ఇదంతా జరిగే పని కాదు. కేసీఆర్, ప్రతిపక్షాల సలహా తీసుకునే పరిస్థితి ఉండదని గులాబీ నేతలు అంటున్నారు. అయినా కేసీఆర్ కరోనా కట్టడికి చేయడంలో తీవ్రంగానే కృషి చేస్తున్నారని, కాబట్టి ఏ టైంలో ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: