గత వారం రోజుల నుంచి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఏపీ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. దక్షిణ కొరియా నుంచి వచ్చిన కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు వీరి మాటల యుద్ధానికి కారణమైంది. ఆ కిట్లలో వైసీపీ ప్రభుత్వం కమిషన్ కొట్టేసిందని, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణలు చేసారు. అయితే దీనికి విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చి, కన్నా, చంద్రబాబుకు 20 కోట్లకు అమ్ముడుపోయారని తీవ్ర ఆరోపణ చేసారు.

 

ఇక ఇక్కడ నుంచి అసలు గేమ్ మొదలైంది. వరుసపెట్టి బీజేపీ నేతలు వచ్చి, విజయసాయిరెడ్డిపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేసేసారు. విజయసాయి జైలు పక్షి అని, బ్రోకర్ అని, చీకట్లో చిల్లర లెక్కలు వేసుకునే వారంటూ బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడారు. అయితే విజయసాయి కూడా వీరి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ, మళ్ళీ చెబుతున్న కన్నా, చంద్రబాబుకు 20 కోట్లకు అమ్ముడుపోయారని అదే మాట చెప్పారు.

 

ఇలా మళ్ళీ విజయసాయి అవే వ్యాఖ్యలు చేయడంతో, బీజేపీ నేతలు రెచ్చిపోతూ మరీ, ఆయనపై విమర్శలు చేసారు. ఆఖరికి పేరులేని నేతలు కూడా విజయసాయిని తిట్టారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ.. కన్నా లక్ష్మీనారాయణపై ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లామని, పరువు నష్టం దావా వేశామని చెప్పారు.

 

అంటే విజయసాయి చేసిన ఆరోపణలకు సరైన సమాధానం చెప్పలేక బీజేపీ నేతలు వెనక్కి తగ్గి, కోర్టుకు వెళ్లారని వైసీపీ కేడర్ భావిస్తోంది. అసలు విజయసాయి చేసింది ఆరోపణ, అది దమ్ముంటే కాదని నిరూపించుకోవాలని, అలా కాకుండా కోర్టుకు వెళితే, బీజేపీ నేతలు విజయసాయిని ఎదురుకోలేకపోతున్నారని అర్ధమవుతుందని అంటున్నారు. అలా అనుకుంటే విజయసాయిని ఇష్టారాజ్యంగా తిట్టారని, అయినా సరే ఆయన కోర్టుకు వెళ్ళలేదని, ఆయన చేసిన ఆరోపణలో వాస్తవం ఉంది కాబట్టి, ఎదురుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: