కరోనా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది..కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది ..  దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని సినీ రాజకీయ ప్రముఖులు సూచించారు..

 

 

 

 

కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అమలులోకి తీసుకొచ్చారు.. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో అన్నీ రంగాలు స్వచ్చందంగా మూతపడ్డాయి..ప్రజల్లో కరోనా పై అవగాహన కల్పించడానికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ను వేదికగా తెలియ పరుస్తున్నారు..ఇకపోతే కరోనా నుంచి ఎలా బయట పడాలని ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు కరొనను పూర్తిగా నాశనం చేయొచ్చునని నిపుణులు అంటున్నారు. 

 

 

 

కోక్యులస్ హిర్సుటస్ అంటే ఏంటో చాలామందికి తెలియకపోవచ్చు కానీ, చీపురుతీగ, దూసరతీగ అంటే మాత్రం పల్లెటూళ్లలో ఉండే చాలామంది గుర్తుపట్టేస్తారు. తీగ జాతికి చెందిన ఈ మొక్క ఇప్పుడు శాస్త్రవేత్తల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఇప్పటికే చీపురుతీగ నుంచి తయారుచేసిన ఔషధాన్ని డెంగ్యూపై పరీక్షించారు. అయితే దీని సమర్థత కరోనా వైరస్ పై ఏ మేరకు ఉంటుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.. ఈ మొక్కను ఉపయోగించి  కరోనా నివారణను చూడాలని అంటున్నారు. 

 

 

 


పరిమిత సంఖ్యలో 50 మంది రోగులపై పరీక్షలు జరిపి ఈ ఔషధం సమర్థతను తెలుసుకోవాలని సీఎస్ఐఆర్ భావిస్తోంది. కోక్యులస్ హిర్సుటస్ నుంచి తయారుచేసిన ఔషధంలో యాంటీ వైరల్ ఎలిమెంట్లు పుష్కలంగా ఉన్నందున డెంగ్యూపై ప్రాథమిక పరీక్షల్లో ప్రభావవంతంగా పనిచేసిందని సీఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు తెలిపారు.ఈ మొక్కను ఎక్కువగా తేగల వాళ్ళు ఉపయోగిస్తున్నారట .. మొత్తానికి కరోనా పంతం పట్టే రోజు వచ్చేసిందన్నమాట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: