కరోనా వైరస్ ఎంత ప్రాచుర్యం పొందిందో అంతకంటే ఎక్కువగా చైనా ప్రాచుర్యం పొందుతోంది. కరోనా వైరస్ ని ఎంతలా తిట్టుకుంటున్నారో అంతలా చైనాని తిట్టుకుంటున్నారు. చైనాలో కరోనా వైరస్ పుట్టింది. అయితే ఇది ఎలా పుట్టింది. పుట్టి ఎక్కడ నుంచి ఎటు పాకింది. దీని మూలాలు ఏంటి, వాటి వేళ్ళూ, వైనాలూ ఎక్కడా.

 

అంటే ఇదంతా చైనాలోనే ఉన్నాయి. కానీ చైనా నిజాలు చెప్పడం లేదు. చైనాలో మీడియాకు ఆంక్షలు ఉన్నాయి. దాంతో అక్కడ వార్తలు బయటకు రావు. అక్కడ ఉన్నంత సీక్రెట్ ప్రపంచంలో మరెక్కడా ఉండదు. ఈ రోజు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ భూతాన్ని చైనా తయారు చేసిందని జపాన్ కి చెందిన నోబెల్ బహుమతి గ్రహీత బాంబు లాంటి వార్తను వినిపించారు.

 

ఆయన అందుకు తగిన ఆధారాలు కూడా చూపిస్తున్నారు. ఆయన పేరు  తసుకు హోంజో. ఈయన అంటున్న ప్రకారం చూస్తే గబ్బిలాల నుంచి కరోనా వైరస్ వ్యాపించలేదు. దీని స్రుష్టి కర్త చైనా. అక్కడి ఊహాన్ ల్యాబుల్లోనే ఇది తయారు అయింది. వూహన్ ల్యాబులో కూడా తసుకు హోంజో నాలుగేళ్ళ పాటు పనిచేశానని చెబుతున్నారు. అక్కడ తనతో పాటు పనిచేసిన సైంటిస్టుల ఫోన్ నంబర్లు ఆయన వద్ద ఉన్నాయట.

 

వారికి ఫోన్ చేస్తే నాలుగు నెలలుగా ఆ ఫోన్ నంబర్లు డెడ్ అయ్యాయట. అంటే ఆ సైంటిస్టులను  చైనా చంపేసిందని తసుకు హోంజో చెబుతున్నారు. చైనా ప్రపంచ ఆధిపత్యం కోసం బయోవార్ కోసం ఇలా చేసిందని కూడా అంటున్నారు. మొత్తానికి ప్రపంచాన్ని అతలాకుతలం చేయడానికి చైనా ఇలా చేసిందన్న అనుమానాలు మెల్లగా బలపడుతున్నాయి.

 

నిన్న అమెరికా, నేడు జపాన్, రేపు ఇంకో దేశం, నిజానికి ప్రపంచం అంతా చైనాను అనుమానిస్తోంది. అందరిలో ఉన్నది ఒక్కటే భావన. చైనా ఇంత పని చేసి ఉంటుందని, రేపటి రోజున మరిన్ని ఆధారాలు దొరికితే మాత్రం అంతర్జాతీయంగా అన్ని దేశాలు కలసి డ్రాగాన్ పని పట్టడం ఖాయం.

 

చైనాను యావత్తు ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టడం ఖాయం. ఆ రోజు దగ్గరలో ఉందని అంటున్నారు. ఇంతకు ఇంతా డ్రాగాన్ మూల్యం చెల్లించుకుంటుందని అంటున్నారు. నిజంగే చైనాకు గట్టి దెబ్బ పడాల్సిందేనని కూడా అంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: