ప్రస్తుతం కరోనా  వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ మహమ్మారి వైరస్ బారిన పడి ఎంతో మంది ప్రాణాలు సైతం వదులుతున్నారు. ప్రపంచం మొత్తం కంటికి కనిపించని ఈ శత్రువుతో పోరాటం చేస్తోంది. అయితే కరోనా వైరస్ తో సంభవిస్తున్న  మరణాలు పురాణాలు లిఖించబడిన నీతిని సూచిస్తున్నాయి. బతికున్నప్పుడు ఎన్ని ఆర్భాటాలు పడిన   చనిపోయిన తర్వాత అందరు ఒక్కటే. పురాణాల్లో ఉన్న  నీతి వాక్యాలు ప్రపంచానికి తెలియ జేస్తుంది కరోనా వైరస్. ఎంత ఉన్న వారైనా ఎంత గొప్ప పేరున్న ఒకసారి ప్రాణం పోయిన తర్వాత అందరూ ఒకటే అన్నది ప్రస్తుతం కరోనా నిరూపిస్తుంది . కరోనా వైరస్ బారినపడి మహామహులు చనిపోయిన సరే వారికి ఒకే విధంగా అంత్యక్రియలు చేయవలసి  వస్తుంది.. 

 


 అయితే చాలామంది కరోనా   ద్వారా జరిగిన మరణాల నేపథ్యంలో మహాభారతం పూసల పర్వంలోని శ్రీకృష్ణుడి మరణం గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం  వచ్చింది. ద్వారక నుంచి చాలా దూరంలో తపోవనం ఉంటుంది. అయితే తపో వనంలో  తపస్సులో మునిగి పోయాడు కృష్ణుడు . అదే సమయంలో శ్రీకృష్ణుడు తండ్రి వసుదేవుడు ప్రాణం కోల్పోగా  ఆ అంత్యక్రియలకు కూడా శ్రీకృష్ణుడు లేడు. వసుదేవుడి  అంత్యక్రియలు వెనువెంటనే జరిపించాలి వచ్చింది.  మరో పుత్రుడైన  బలరాముడు కూడా లేడు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడికి ఈ వార్త చెప్పడానికి శ్రీకృష్ణుని కోసం వెతక సాగడు అర్జునుడు. ఎంత  వెతికినా శ్రీకృష్ణుడు జాడ మాత్రం దొరకలేదు . 

 


 ఇక చివరికి తపోవనంలో ఓ చోట శ్రీకృష్ణుడు కనిపించాడు.  కానీ సజీవంగా కాదు ప్రాణాలు లేకుండా కనిపించాడు. దీంతో అర్జునుడు ఎంతగానో  నిరోధించాడు కుమిలిపోయాడు. అక్కడున్నది శ్రీకృష్ణ కళేబరం అని నమ్మలేకపోయాడు. బోయవాడు వేసిన బాణం కాలికి తగిలి కృష్ణుడు ప్రాణాలు వదిలాడు. ఈ సమయంలో  అర్జునుడు వెంట  కేవలం రథ సారధి  మరో ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇక కృష్ణుడు మృతదేహాన్ని ద్వారకకు తీసుకెళ్లే అవకాశం కూడా లేకపోవడంతో అక్కడ ఎవరూ లేకుండానే... ఎలాంటి సాంప్రదాయాలు పాటించకుండానే కృష్ణుడి అంత్యక్రియలు జరిపించారు. అయితే దీంట్లో ఉన్న నీతి ఏంటంటే ఎంత గొప్ప వాళ్ళు అయినా సరే సంపద ఉన్న  చనిపోయిన తర్వాత అందరూ ఒక్కటే అన్నది ప్రస్తుతం కరోనా వైరస్ చెబుతుంది అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: