ఈ ఒక్క రోజే ఇండియాలో రికార్డు స్థాయిలో  కరోనా కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా శనివారం రాత్రి 10 గంటల వరకు 1812 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు సమాచారం. ఇప్పటివరకు సింగిల్ డే లో ఈరెంజ్ లో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. మహారాష్ట్ర లో ఈ ఒక్క రోజే 811 కేసులు నమోదుగా ఢిల్లీ లో 111 కేసులు నమోదయ్యాయి. మొత్తం ఇప్పటివరకు ఇండియాలో  కరోనా కేసుల సంఖ్య  26264కు చేరుకోగా 750కిపైగా మరణాలు సంభవించాయి. ఇక లాక్ డౌన్ విధించిన కూడా కేసుల ఉదృతి ఏ మాత్రం తగ్గడం లేదు.

 

మరో వైపు కేసుల సంఖ్య పెరుగుతున్నా కూడా  కేంద్రం లాక్ డౌన్ విషయంలో సడలింపులు ఇచ్చుకుంటూ వెళుతుంది. తాజాగా గ్రీన్ జోన్ లలో అన్ని రకాల షాపులను  తెరచుకోవచ్చని ప్రకటించింది. అయితే  షాపింగ్ మాల్స్ , హెయిర్ సెలూన్ , వైన్స్ మాత్రం తెరవడానికి  వీలులేదు. అలాగే రెడ్ జోన్ అలాగే కాంటమినేట్ జోన్ లలో మాత్రం ఎలాంటి మినహాయింపులు లేవని  స్పష్టం చేసింది. 

 

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే  తెలంగాణ లో కరోనా తగ్గుముఖం పడతుంది. చాలా రోజుల తరువాత మొదటి సారి సింగిల్ డిజిట్ కేసులు నమోదయ్యాయి. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా  శనివారం 7కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 990కి చేరింది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎలాంటి తగ్గుదల లేదు. ఈరోజు కొత్తగా 62 కేసులు నమోదు కావడం తో మొత్తం కేసుల సంఖ్య 1016 కి చేరింది. అందులో 31మంది మరణించారు. వచ్చేనెల 3వతేదితో లాక్ డౌన్ ముగియనుండగా తెలంగాణ లో మాత్రం మే 7వరకు కొనసాగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: