కరోనా దెబ్బకు దేశవ్యాప్తంగా అన్నీ విద్యా సంస్థలతో పాటు విశ్వవిద్యాలయాలు కూడా మూతపడ్డాయి. దీంతో జాతీయ పరీక్షలతో పాటు విశ్వవిద్యాలయాల పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ఇకపోతే మరికొద్ది రోజుల్లో ప్రాథమిక నుంచి ఉన్నత విద్యా సంవత్సరం ప్రారంభం కావాల్సిన సమయం వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా విద్యాసంవత్సరం నిర్వహణ పై ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసి) ఇటీవల రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. విద్యా సంవత్సరం నష్టంతో పాటు ఆన్లైన్ విద్య గురించి కూడా కమిటీలు క్షుణ్ణంగా స్టడీ చేసి శుక్రవారం తమ నివేదికలను అందజేశాయి.

 

ప్రతి సంవత్సరం జూలైలో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం సారి మాత్రం సెప్టెంబర్ నుండి ప్రారంభించాలని హర్యానా విశ్వవిద్యాలయ విసి, ఆర్సి కుహాడ్ నేతృత్వంలోని మొదటి కమిటీ సూచించగా అలాగే సరైన ఆన్ లైన్ వసతులు లేనిపక్షంలో లాక్ డౌన్ తర్వాతే పరీక్షలు నిర్వహించాలని ఇగ్నో వీసీ నాగేశ్వరరావు నేతృత్వంలోని మరొక కమిటీ సూచించింది. వీరు ఆన్లైన్ పరీక్షలకు మొగ్గు చూపగా దానిపై కొన్ని విద్యాలయాలు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఇక రెండు కమిటీల నివేదికలు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది.

 

తాజాగా నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే ఇక సెప్టెంబర్ ఉండే వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం కావడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే మధ్యలో జేఈఈ మరియు నీట్ పరీక్షలను జూన్ లో నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో కరోనా వ్యాప్తి తగ్గితేనే విద్యా సంవత్సరంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. క్రమంలో మే 3 తేదీ వరకు విధించిన లాక్డౌన్ మళ్లీ పొడిగించే అంశం కూడా ఉంది. దీంతో మరికొన్నాళ్లు పరిస్థితి కొనసాగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: