లోకంలో ఇన్ని మరణాలు జరుగుతున్న.. పరిస్దితులు చేయిదాటిపోతున్నా.. ప్రజలకు మాత్రం కరోనా అంటే ఒక గోళి వేసుకుంటే తగ్గిపోయే వ్యాధిలా కనిపిస్తుంది కావచ్చూ.. ఇప్పటి వరకు మందు మాకూలేని మాయదారి రోగమని గ్రహించడం లేదు.. దేవుని ప్రసాదం పంచినట్లుగా ఎక్కడో కరోనా అంటించుకుని చుట్టుపక్కల వారికి అంటించుకుంటూ వస్తూన్నారు.. ఇలాంటి వారిని బుద్ధి హీనులుగా భావించక తప్పదని కొందరు గుర్రుగా చూస్తున్నారు..

 

 

అరే కొన్ని రోజులు బయటకు వెళ్లకుంటే బ్రతకలేరా.. ఇప్పటికే వైద్యులు, పారిశుద్ధ కార్మికులు, పోలీసులు ప్రజల ప్రాణాల కోసం రాత్రిపగలు కష్టపడుతుంటే, మరీ చేతులెత్తి దండాలు పెడుతుంటే మెదడుకు ఎక్కడం లేదు కావచ్చూ.. అందుకే 'తాను చెడ్డ కోతి, వనమంతా చెడిపింది.. అన్నట్లుగా ఉంది కొందరి పరిస్దితి.. ఇంతలా ఎందుకు ఆవేదన పడవలసి వస్తుందంటే కాలక్షేపం కోసం ఒకచోట చేరి కరోనాను వ్యాపింపచేశారు కొందరు మహానుభావులు.. విజయవాడలో జరిగిన ఈ ఘటన అధికారులను ఆందోళనకు గురిచేస్తుంది..

 

 

ఇకపోతే కృష్ణాజిల్లాలో 127 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 102 కేసులు విజయవాడలోనే ఉన్నాయి. కాగా ఇన్ని కేసులు ఇక్కడే ఎలా నమోదయ్యాయని దృష్టి సారించిన అధికారులకు తెలిసింది ఏంటంటే.. కృష్ణలంకకు చెందిన ఓ లారీడ్రైవర్‌ కోల్‌కతాకు లోడ్‌ తీసుకుని వెళ్లి ఈనెల 4న,  ఒడిశా మీదుగా తిరిగి వచ్చాడు. ఆ వచ్చిన వాడు తిన్నగా ఉండక ఇరుగుపొరుగు వారిని పిలిచి ఇంట్లో పేకాట మొదలుపెట్టాడు. నేనేం తక్కువతినలేదని అతని భార్య కూడా చుట్టుపక్కల మహిళలను పిలిచి హౌసీ నిర్వహిస్తుంది..

 

 

ఇలా ఆ ఒక్క వ్యక్తి ద్వారా 24 మంది కరోనా బారిన పడ్డారు. ఇదిలా ఉండగా.. కార్మికనగర్‌కు చెందిన ఓ ట్రక్‌ డ్రైవర్‌ దుబాయ్‌ వెళ్లి అక్కడి నుంచి శ్రీలంక, చెన్నై మీదుగా విజయవాడకు వచ్చాడు. ఇతను అంతే.. హోం క్వారంటైన్‌ పాటించకుండా.. ఇంటి దగ్గర సామూహిక విందు, వినోదాలు మొదలుపెట్టాడు.. ఫలితంగా 14 మందికి కరోనా వైరస్‌ గిఫ్ట్‌గా వచ్చింది.. ఇలాంటి వారుండగా కరోనా ఆగమంటే ఎక్కడ ఆగుతుంది చెప్పండి.. చివరికి జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్ కూడా.. అధికారులు, వైద్య సిబ్బంది ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల్లో మార్పు రాకుంటే నియంత్రించడం కష్టమని పేర్కొంటున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: