కరోనా వైరస్ సృష్టించబడుతున్న సమయంలో ఆ వైరస్ భయపడి ఉంటుంది కావచ్చూ.. ఎందుకంటే ప్రపంచం చాలా అభివృద్ధి చెందింది.. అందులో మనిషి తెలివితేటలకు అంతేలేదు.. ఈ సృష్టిని సృష్టించిన విధాతకు సైతం సవాల్ విసిరి.. మరో సృష్టిని చేశాడు.. మరణాన్ని జయించడాని చేసే ప్రయత్నాలు చాలా దగ్గరి వరకు వచ్చాయి.. ప్రతి వ్యాధిని నిర్ధారించే ల్యాబ్‌లు.. పెద్ద పెద్ద డాక్టర్లు.. అబ్బో ప్రపంచంలో పెరిగిన టెక్నాలజీకి ఈ కరోనా వైరస్ గజగజ వణికిపోయి ఉంటుంది.. ఒక వేళ తాను బయటకు వస్తే ఈ మనుషుల మధ్య తాను బ్రతకడం చాలా కష్టం తనకు తొందరగానే మరణాన్ని ప్రాప్తింపచేస్తారు.. ఈ మనుషులు అని చెప్పుకునే మేధావులు.. అని ఎన్నో ఆలోచనలతో తను పుట్టుంది..

 

 

కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని టెక్నాలజీలు, శాస్త్రవేత్తలు, పెద్ద పెద్ద వైద్య విద్యలు, ల్యాబ్‌లు అన్నీ కూడా కరోనా ముందు గడ్దిపోచలా మారిపోయాయి.. ఇంకేముంది ఈ మానవులు ప్రకృతిని నాశనం చేసి తమ చావును తామే కనుగొన్నారు అని సంతోషిస్తూ.. వీళ్ల బొంద ఇన్నాళ్లూ ఈ మనుషుల్ని గొప్పోళ్ళుగా భావించి అనవసరంగా భయపడ్డా.. అంటూ తల ఎత్తుకుని ఇప్పుడు అన్ని దేశాలలో ధైర్యంగా సంచరించడం మొదలుపెట్టింది ఆ కరోనా.. ఇక ఈ మనుషులు ఇప్పట్లో తనను ఏం చేయలేరని తెలుసుకుని చిత్రావిచిత్రంగా తన పద్దతులు మార్చుకుంటూ మనిషిలో ఉన్న అన్ని అవయాల్లో తిష్టవేయడానికి సిద్దమైంది.. చచ్చినోడికి దారి శ్మశానమే.. కానీ ఈ కరోనాకు అన్ని దారులు తనవే.. అందుకే మనిషిలో ఉన్న నవరంధ్రాలను తన మార్గాలుగా చేసుకుని విజృంభిస్తుంది..

 

 

ఇందులో భాగంగా కళ్లూ కూడా కరోనాకు స్థావరాలేనని వెల్లడైంది కరోనా నుండి కోలుకున్న ఓ బాధితురాలి కళ్లలో ఐదు రోజుల తర్వాత ఈ వైరస్‌ ఆనవాళ్లు కనిపించడంతో వైద్యులు ఈ నిర్ధారణకు వచ్చారు. తాజాగా కళ్లలోనూ ఈ వైరస్‌ వృద్ధి చెందుతుందని.. కన్నీరు, ఇతర కంటి స్రావాల ద్వారా ఈ వైరస్‌ ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉందని స్పష్టమైందని ఇటలీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇక ముందస్తుగా కళ్లు గులాబీ రంగులోకి మారడం కరోనా లక్షణం కావొచ్చని సూచిస్తున్నారు.. ఈ విషయాన్ని వెల్లడించడానికి ముందు జనవరి 23న వుహాన్‌ నుంచి తిరిగొచ్చిన ఒక మహిళను క్షుణంగా పరిశీలించారు..

 

 

ఆమెలో పొడి దగ్గు, గొంతులో ఇన్‌ఫెక్షన్‌తో పాటు ఆమె కళ్లుగా ఎర్రగా ఉండడాన్ని వైద్యులు గుర్తించారు. దీంతో వైద్యులు రోజూ ఆమె కళ్ల నుంచి స్రావాలు సేకరించి పరీక్షించారు. ఇలా 21 రోజుల పాటు ఆమె కళ్లలో కరోనా వైరస్‌ ఉన్నట్లు వెల్లడైంది. కాగా ఆమె కోలుకుని ఇంటికి వెళ్లిన తర్వాత ఐదు రోజులకు ఆమె కళ్లలోని స్రావాలను తిరిగి పరీక్షించగా.. కరోనా వైరస్‌ తిరిగి వచ్చినట్లు గుర్తించారు... చూసారా మొదట కరోనా ఈ ప్రపంచాన్ని చూసి భయపడ్దది కానీ ఇప్పుడు ప్రపంచాన్నే భయపెడుతుంది.. అందుకే ఎంత జాగ్రత్తగా ఉండే అన్నిరోజులు బ్రతక వచ్చూ.. లేదంటే త్వరగానే పైకి పోవచ్చూ.. కాబట్టి ప్రజలారా చాయిస్ మీదే..

 

మరింత సమాచారం తెలుసుకోండి: