ప్ర‌పంచంలోని కోట్లాదిమంది క‌రోనా త‌ర్వాత ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించే ఎక్క‌వ‌గా మాట్లాడుకుంటున్నారు. గ‌త వారం రోజులుగా కిమ్ జోంగ్ ఉన్ఉ ఆరోగ్యంపై రకరకాల ఊహాగానాలు విన‌బడుతున్న విష‌యం తెలిసిందే. ఉత్త‌ర కొరియా కూడా ఈ ఊహాగానాల‌కు చెక్ పెట్టేందుకు స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న కూడా చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఊహాగానాల‌కు బ‌లం చేకూర్చిన‌ట్ల‌యింది. రెండు వారాలుగా కిమ్ ప్రపంచానికి కనిపించక‌పోవ‌డం గ‌మ‌నార్హం.  ఏప్రిల్ 15న తన తాత, కొరియా జాతిపిత... రెండో కిమ్ సంగ్ జయంతి వేడుకల‌కు ఆయ‌న హాజ‌రు కాక‌పోవ‌డంపై  అనుమానాలు మొద‌ల‌య్యాయి. 

 

అయితే  శనివారం నార్త్ కొరియా మిలిటరీ ఫౌండేషన్ డేకి కూడా రాక‌పోవ‌డం విశేషం. అధ్య‌క్షుడి ఆరోగ్యం బాలేదన్న వాదనలు ఇప్పుడు ఊపందుకున్నాయి. ఆయనకు హార్ట్ సర్జరీ చేసిన తర్వాత... బ్రెయిన్ డెడ్ అయ్యి..కోమాలోకి వెళ్లిపోయార‌నే వార్త‌లు ఇప్పుడు బాగా ప్ర‌చారంలో ఉన్నాయి. అయితే ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ట్లుగా త‌మ వ‌ద్ద ఎలాంటి ఆధారాల్లేవ‌ని దాయాది దేశ‌మైన ద‌క్షిణ కొరియా ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఇక అమెరికా మాత్రం అస‌లు విష‌యం రాబ‌ట్టేందుకు నిఘా సంస్థ‌ల‌ను రంగంలోకి దింపిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే  నార్త్ కొరియా రిసార్ట్ దగ్గర కిమ్ జోంగ్ ఉన్ ట్రైన్... ఎందుకు ఉంది? అనే విష‌యంపై అమెరికా ఆరా తీయ‌డం మొద‌లుపెట్టింది.

 

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌కి చెందిన రైలుగా చెప్పుకునే ఓ ట్రైన్... ఉత్తర కొరియాలోని రిసార్ట్ టౌన్‌లో వాన్సాన్ ఎలైట్ రైల్వే స్టేషన్ దగ్గర  ఉండ‌టాన్ని  శాటిలైట్ ఫొటోల ద్వారా అమెరికా విశ్లేషిస్తోంది. సాధారణంగా కిమ్, ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ఈ ట్రైన్‌ని ఉపయోగిస్తారు. వాన్సాన్‌లో ఉన్నది ఆ ట్రైనే అని రాయిటర్స్ వార్తా సంస్థ... క‌థ‌నంలో పేర్కొన‌డం విశేషం.  ఇదిలా ఉండ‌గా అస‌లు కిమ్ ఆరోగ్యంపై గాని, అత‌డి క‌ద‌లిక‌ల‌పైనా గాని ఇంత గోప్య‌త ఎందుకు పాటించాల్సి వ‌స్తుందో కూడా ప్ర‌పంచ జ‌నాల‌కు అంతుప‌ట్ట‌డం లేదు. మ‌రికొంత‌మంది మాత్రం కిమ్ మ‌ర‌ణించి ఉంటాడ‌ని, త‌ద‌నంన‌త‌రం ఆయ‌న వార‌సుడి ఎంపిక పూర్త‌య్యేంత వ‌ర‌కు మ‌ర‌ణంపై ప్ర‌క‌ట‌న చేయ‌వ‌ద్ద‌ని సైన్యం దాస్తోంద‌న్న అనుమానాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: