కరోనాతో సామాన్యుడి నెత్తిన లాక్ డౌన్ వచ్చిపడింది. ఇది ఇప్పుడు చాలా మంది మానసిన ఆందోళనకు కారణమైంది. అంతే కాదు...కుటుంబాల్లో కూడా  చిచ్చుపెట్టింది. ఇదంతా ఒక ఎత్తయితే...సోషల్ మీడియాలో వచ్చే వార్తలు మనిషికి నిద్రకూడా లేకుండా చేస్తోంది.

 

దేశంలో కరోనా వైరస్ ఇప్పుడు అందరినీ వణికిస్తోంది. రోగం రావడమేందో గానీ అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. జబ్బు వస్తే ఎలా నయం అవుతుందో అని...? వ్యాధి తమకు ఏమైనా వస్తుందా ఏంటి..? అని ఇలా ప్రతీదీ ఇప్పుడు మనిషిని మానసిక వేదనకు గురిచేస్తోంది.

 

దేశ వ్యాప్తంగా ఢిల్లీ, మహారాష్ట్ర. రాజస్ధాన్ లతో పాటు..తెలంగాణలో కూడా ఎక్కువ మంది మానసిక ఆందోళనతో సైకాలజిస్ట్ లను సంప్రదించే పరిస్ధితికి వచ్చిందంటే  పరిస్ధితి ఏంటో ఆర్ధం చేసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం కూడా సైకాలజీస్టులతో ఓ టీమ్ ని ఏర్పాటు చేసింది. దీనికి కూడా...నిత్యం 100 కాల్స్ వస్తున్నాయి. ఇది రోజు రోజుకు పెరుగుతుంది. వ్యాధి తీవ్రత గురించి తెలుసుకోవాలనే వారి ఉత్సుకతతో పాటు.... ఏం జరుగుతుందో  అర్ధంకాక ఆందోళన చెందుతున్న వారు కూడా మానసిక నిపుణులను సంప్రదిస్తున్నారు.

 

లాక్ డౌన్ తో...అంతా ఇంటికే పరిమితం అయ్యారు. సాధారణ రోజుల్లో భర్తలు తమకు టైం కేటాయిచండంలేదనే ఫిర్యాదులు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు లాక్  డౌన్ తో 24 గంటలు భార్యాభర్తలు కలిసే ఉండటంతో ఇద్దరి మద్య మనస్పర్ధలతో హెల్ప్ లైన్ ని సంప్రదిస్తున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.  ఇక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే వారంతా గిచ్చుకోవడం గిల్లుకోవడంతో  సరిపోతోంది. ఇక పాజిటీవ్ కేసులు వచ్చిన కాలనీ వాసుల ఆందోళన అంతా ఇంతా కాదు. చిన్నపాటి జలుబు...సాధారణంగా ఎండా కాలం  వచ్చే జ్వరం వచ్చినా ఇది ఖచ్చితంగా కరోనానే అని మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఎర్రగడ్డలో కూడా ఇలాంటి మానసిక ఆందోళనలకు  గురయ్యే వారి కోసం ఓ బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.  

 

మానసికంగా ఆందోళన చెందుతున్న వారిలో నిద్రలేమి సమస్య మరింత తీవ్రమైంది. ఆరోగ్య సమస్యలతో పాటు... ఆర్ధిక అంశాలన్ని కూడా మానసిక ఆందోళనకు  ప్రధాన కారణం అవుతుంది. ప్రయివేటు కంపెనీల్లో పని చేసే వారికి ఉద్యోగ భయం ఎక్కువగా పట్టుకుంది. దీనికి తోడు... బ్యాంకుల్లో చెల్లించాల్సిన ఈఎంఐ ల  ఆందోళనకు తోడుగా.... లాక్ డౌన్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది. లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే పనులు దోరుకుతాయా,..? అప్పుల  ఎలా కట్టాలి అనే టెన్షన్ కూడా  ఉంది.  

 

కరొనా జబ్బు వచ్చిన వారి కంటే ఎక్కువగా కూడా వస్తే ఏమైపోతామనే భయంతో పాటు... వచ్చిన వారి ద్వారా మనకు వస్తే పరిస్ధితి ఏంటనే మానసిక ఆందోళన  చెందే వారు ఎక్కువయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: