క‌రోనా వైర‌స్‌ను క‌నుగొన్న చైనా దేశంలోని వుహాన్‌లో ప్ర‌స్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య జీరో అని ఆ దేశ వైద్య ఆరోగ్య‌శాఖ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇక్క‌డి నుంచే చైనాలోని ప‌లు న‌గ‌రాల‌కు..అక్క‌డి నుంచి ప్ర‌పంచంలోని చాలా దేశాల‌కు ప్ర‌యాణికుల ద్వారా వైర‌స్ ఎగుమ‌తి అయింది. కొద్దిరోజులుగా చైనాలో చేప‌ట్టిన లాక్‌డౌన్ ఫ‌లితాలు...మ‌రికొన్ని వైద్య ప‌రీక్ష‌ల నేప‌థ్యంలో వూహాన్‌లో గ‌ణ‌నీయంగా వైర‌స్ అదుపులోకి వ‌చ్చింది. వ్యాప్తిని నియంత్రించ‌డంలో చైనా ప్ర‌భుత్వం అద్భుత‌మైన విజ‌యం సాధించిద‌నే చెప్పాలి. ఇక ఇప్పటివరకూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారందరూ కోలుకున్నారని, అందరినీ ఇంటికి పంపిన‌ట్లు చైనా అధికారిక వ‌ర్గాలు తెలిపాయి.  

 

స్థానికులు, వైద్య సిబ్బంది సమష్టి కృషితో ఇది సాధ్యపడింద‌ని చైనా అధికారిక వ‌ర్గాలు ఆనందం వ్య‌క్తం చేశాయి. ఇక ప్ర‌పంచంలోని చాలా దేశాల‌కు ఇప్పుడు సాయం అందించేందుకు చైనా వైద్య బృందాలు సిద్ధంగా ఉన్నాయ‌ని అధికారిక వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఇప్ప‌టికే ఇట‌లీ, పాకిస్థాన్ వంటి దేశాల్లో చైనా వైద్య బృందాలు త‌మ సేవల‌ను అందిస్తున్న‌ట్లు గుర్తు చేశాయి. త్వ‌ర‌లో యూర‌ప్ కంట్రీల‌కు సాయం అందించ‌నున్న‌ట్లు  అక్కడి జాతీయ ఆరోగ్య కమిషన్‌ అధికార ప్రతినిధి మీ ఫెంగ్‌ వెల్లడించారు. ఈ మహమ్మారి మొదటగా ఈ నగరంలోనే వెలుగుచూసిన విషయం తెలిసిందే. మొత్తం 46,452 కరోనా కేసులు నమోదు కాగా.. 3,869 మంది కన్నుమూశారు. మరోవైపు ఇతర దేశాల్లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.


ప్రపంచ వ్యాప్తంగా కరోనా మ‌ర‌ణ మృదంగం కొన‌సాగిస్తోంది.  ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2 లక్షలు దాటిపోవ‌డం గ‌మ‌నార్హం. ఇక క‌రోనా బారిన ప‌డిన వారి సంఖ్య ఏకంగా 29 లక్షలకు చేరువైంది. అయితే... మొత్తం కేసుల్లో మూడో వంతు, మరణాల్లో నాలుగో వంతు ఒక్క అమెరికాలోనే చోటుచేసుకున్నాయి.  స్పెయిన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ, బ్రిటన్‌, టర్కీల్లో నమోదైన మొత్తం కేసుల కంటే ఇక్కడి కేసులే ఎక్కువగా ఉన్నాయి. ప‌రిస్థితి ఇంత భ‌యాన‌కంగా ఉన్నా అమెరికా మాత్రం లాక్‌డౌన్ ఎత్తివేత‌కు ఆస‌క్తి చూపుతుండ‌టం విశేషం. సామాజిక దూరం పాటిస్తూ కార్య‌క‌లాపాలు నిర్వ‌హించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించేందుకు సిద్ధ‌ప‌డుతోంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: