క‌రోనా వైర‌స్  దేశంలో శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది. భార‌త్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 27వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా దాదాపు వెయ్యికిపైగా మ‌ర‌ణాలు చోటుచేసుకున్నాయి. ఇక ఇందులో పాజిటివ్ కేసుల్లోనూ, మ‌ర‌ణాల్లోనూ మ‌హారాష్ట్రలోనే ప్ర‌థ‌మ‌స్థానంలో ఉండ‌టం గ‌మ‌నార్హం. దేశంలో న‌మోదైన మొత్తం కేసుల్లో మ‌హారాష్ట్ర‌లోనే  ఆదివారం నాటికి 7628 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలోని మొత్త పాజిటివ్ కేసుల్లో 1076 మంది పూర్తిగా క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డి హోం క్వారంటైన్‌లో కొన‌సాగుతున్న‌ట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ అధికారులు ప్ర‌క‌టించారు. 


ఇదిలా ఉండ‌గా పాజిటివ్ కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతుండ‌టంపై ఉద్ద‌వ్‌థాక్రే ప్ర‌భుత్వం స‌రైన చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంపై మూలంగానే ఈవిధంగా జ‌రుగుతోంద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. దీంతో ఆయ‌న ఆదివారం మీడియాతో మాట్లాడారు. మ‌హారాష్ట్ర‌లోనే ఎందుకు అంత‌లా కేసులు పెర‌గ‌డానికి గ‌ల కార‌ణాల‌ను వివ‌రించారు. ప్ర‌ధానంగా ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల్లో 80శాతం వ‌ర‌కు కూడా ఎలాంటి క‌రోనా ల‌క్ష‌ణాలు లేకుండానే పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌వాళ్లు ఉన్న‌ట్లు తెలిపారు. మిగతా 20శాతం బాధితుల్లో కొందరిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తుండగా మరికొందరిలోనే తీవ్రంగా ఉన్నట్లు గుర్తించామన్నారు.
 

క‌రోనా వైర‌స్ అనుమానిత ల‌క్ష‌ణాలు క‌లిగి ఉన్న వారు ఎలాంటి సొంత వైద్యం పాటించ‌కుండా  వెంటనే వైద్య‌శాల‌ల‌కు రావాల‌ని పిలుపునిచ్చారు.  వైర‌స్ వ్యాప్తి  జ‌ర‌గ‌కుండా ఉండేందుకు లాక్‌డౌన్‌ను ప‌క‌డ్బందీగా అమ‌లు చేస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో లాక్‌డౌన్ స‌డ‌లింపు అనేది అసాధ్య‌మ‌ని తేల్చేశారు. చాలా సున్నిత‌మైన అంశంగా ఆయ‌న చెప్పారు. ఈనెలాఖ‌రు వ‌ర‌కు వ్యాధి వ్యాప్తిని, తీరును అంచానా వేసి స‌డ‌లింపుల‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పారు. అయితే రైలు, బ‌స్సు స‌ర్వీసుల‌ను మాత్రం ఇప్ప‌ట్లో న‌డ‌ప‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: