ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఇటీవ‌ల సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలి‌సిందే. పొరుగు దేశ‌మైన చైనాకు షాకిచ్చేలా సరిహద్దు దేశాల నుంచి మనదేశ కంపెనీల్లో ఇన్వెస్ట్‌‌మెంట్లు (ఎఫ్‌‌డీఐ) రావడానికి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకునేలా నిబంధ‌న‌ల‌‌ను మార్చింది. చైనా ఇన్వెస్టర్ల నుంచి ఇండియన్‌‌ కంపెనీలను రక్షించుకునేందుకు ప్రభుత్వం ఎఫ్‌‌డీఐ రూల్స్‌‌ను మార్చిన విషయం తెలిసిందే. ఈ రూల్స్‌‌ ప్రకారం చైనా ఇన్వెస్టర్లు ఆటోమెటిక్‌‌ రూట్‌‌లో ఇండియన్ కంపెనీల్లో ఇన్వెస్ట్‌‌ చేయడానికి కుదరదు. వీరు ప్రభుత్వ పర్మిషన్‌‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రూల్స్‌‌ ఇప్పటికే ఉన్న ఎఫ్‌‌డీఐ ఓనర్‌‌‌‌ షిప్‌‌ ట్రాన్స్‌‌ఫర్‌‌కు  కూడా వర్తిస్తాయి. అయితే, ఇది మ‌న‌కే దెబ్బ అని అంటున్నారు.

 

వివిధ పెట్టుబ‌డుల లెక్క‌లు, మార్కెట్ అంచ‌నాల ప్ర‌కారం ప్ర‌ధాని నిర్ణ‌యంతో ప‌ర్భావం భాగానే ఉండే అవ‌కాశం ఉంది. గత ఐదేళ్లను గమనిస్తే చైనా ఇన్వెస్ట్‌‌మెంట్లు ఇండియన్‌‌ ఈ–కామర్స్‌‌, టెక్‌‌, రిటైల్‌‌, ఆటోమోటివ్‌‌, మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్లలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టాయి. 2011 లో ఇండియాలో చైనా ఇన్వెస్ట్‌‌మెంట్లు కేవలం 102 మిలియన్‌‌ డాలర్లే!  ప్రస్తుతం ఇవి 5–8 బిలియన్‌‌ డాలర్లకు చేరుకున్నాయి. ఇండియన్‌‌ స్టార్టప్‌‌లలో బైదు, అలీబాబా, టెన్సంట్‌‌ వంటి చైనీస్‌‌ టెక్‌‌ ఇన్వెస్టర్లు 4 బిలియన్‌‌ డాలర్లు ఇన్వెస్ట్‌‌ చేశారు. గత ఐదేళ్లలో 30 ఇండియన్‌‌ యూనికార్న్‌‌లకు 18 కంపెనీలకు చైనా ఇన్వెస్ట్‌‌మెంట్లు వచ్చాయి.  చైనీస్‌‌ వీడియో యాప్‌‌ టిక్‌‌టాక్  సబ్‌‌స్క్రిప్షన్‌‌ ఇండియాలో యూట్యూబ్‌‌ను అధిగమించింది. అలీబాబా, టెన్సెంట్‌‌, బైట్‌‌డ్యాన్స్‌‌ వంటి కంపెనీలు ఫేస్‌‌బుక్‌‌, అమెజాన్‌‌, గూగుల్‌‌ వంటి వాటితో పోటీపడుతున్నాయి. ఇండియన్‌‌  ఫోన్‌‌ మార్కెట్‌‌ను చైనా కంపెనీలు డామినేట్‌‌ చేస్తున్నాయి. షియోమి వచ్చే ఐదేళ్లలో 100  ఇండియన్‌‌ స్టార్టప్‌‌లలో  రూ.ఏడు వేల కోట్ల వరకు ఇన్వెస్ట్​ చేయనుంది. ఇలాంటి వాటిపై ఈ నిర్ణ‌యం ప్ర‌భావం చూప‌నుంది.

 

 

ఈ నిర్ణ‌యం వ‌ల్ల  ఇండోనేషియా, థాయ్‌‌లాండ్‌‌, వియత్నాం, ఫిలిప్పిన్స్‌‌, ఆఫ్రికా దేశాలకు  చైనా ఇన్వెస్ట్‌‌మెంట్లు వెళ్లిపోతాయని చైనా వెంచర్‌‌‌‌ క్యాపిటలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఎఫ్‌‌డీఐ పాలసీని మార్చడం వలన చైనీస్‌‌ కార్పొరేట్‌‌ సర్కిల్స్‌‌ ఆందోళనలో ఉన్నాయని, తాజా నిర్ణ‌యంతో దేశం యొక్క ‌ ఈజ్‌‌ ఆఫ్‌‌ డూయింగ్‌‌ బిజినెస్‌‌పై నమ్మకం పడిపోతుందని అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ ప్రపోజల్స్‌‌ దీంతో తాత్కాలికంగా ఆగిపోతాయని చెప్పారు. వెంచర్‌‌‌‌ క్యాపిటలిస్ట్‌‌లు వెయిట్‌‌ అండ్‌‌ వాచ్‌‌ మోడ్‌‌ను ఫాలో అవుతారని అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: