దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టడం కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతుతున్నాయి. ఇప్పటికే కొన్ని థెరపీలు మంచి ఫలితాలను ఇస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే మన దేశంలో కర్ణాటక, ఢిల్లీలో ప్లాస్మా థెరపీ సత్ఫలితాలను ఇస్తోంది. ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం కూడా సక్సెస్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
చైనా ఇప్పటికే వ్యాక్సిన్ ను తయారు చేసి క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. భారత్ లో ఆరు కంపెనీలు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు పరిశోధనలు జరుపుతున్నాయి. లాక్ డౌన్ అమలు వల్ల వైరస్ వ్యాప్తిని ఆలస్యం చేయడం తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రస్తుతం కరోనాను కట్టడి చేయడానికి హైడ్రాక్సీ క్లిరోక్విన్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. 
 
అయితే ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు పొగాకు నుంచి కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. సిగరెట్ కరోనా మహమ్మారిని ఎదుర్కొంటుందా..? అనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు నికోటిన్ తో కరోనా వైరస్ కు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు. నికోటిన్ కరోనా వైరస్ ను అంతం చేయడంలో సహాయపడుతుందని అన్నారు. 
 
త్వరలో పూర్తి స్థాయి పరిశోధనలు జరిపి నికోటిన్ తో కరోనాను నియంత్రించడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. దేశంలో ఇప్పటివరకు 26496 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 5804 మంది కరోనా నుంచి బయటపడగా 824 మంది మృతి చెందారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 990 కు చేరగా ఏపీలో 1097 కేసులు నమోదయ్యాయి.                                        

మరింత సమాచారం తెలుసుకోండి: