ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఇస్తూ ఉంటే మరోవైపు హత్యలు, ఆత్మహత్యలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇక మంటలు అదుపు చేసేందుకు వెళ్లిన అగ్నిమాపక దళ అధికారిగా మంటలలో చిక్కుకొని ఆహుతైన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ జిల్లాలో చోటు చేసుకోవడం జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..

 

IHG

ఈ దారుణమైన ఘటన అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలో చోటుచేసుకుంది. తాజాగా పెనుగొండ మండలంలోని రాంపురం సమీపంలో గుజిరి గోడౌన్ లో భారీగా అగ్నిప్రమాదం ఏర్పడింది. మంటలు ఎక్కువగా ఎగిసి పడుతుండడంతో అక్కడ ఉన్న స్థానికులు త్వరగా అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించిన అగ్నిమాపక అధికారాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేయడం జరిగింది.

 

IHG

ఈ తరుణంలోనే ఫైర్ ఆఫీసర్ పరంధామా ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుపోయాడు. ఆ అగ్నికీలల్లో నుంచి బయటపడలేక అక్కడికక్కడే సజీవదహనం అయ్యాడు. 

IHG


వాస్తవానికి మంటలు అధికస్థాయిలో ఎగిసి పడుతుండడంతో అదుపు చేయడం చాలా కష్టం అయ్యిందనే చెప్పాలి. ఇప్పటికే కోటి రూపాయలకు పైగా నష్టం వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా మంటలను అదుపు చేయడానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది కూడా ఇలా అవ్వడంతో స్థానికులను బాగా కలిచి వేయడం జరిగింది.  ఇక ఈ విషయంపై పూర్తి కారణాలు ఆరాతీస్తున్నారు అనే చెప్పాలి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. ఏది ఏమైనా కానీ సహాయం చేయడానికి వచ్చిన అగ్నిమాపక అధికారి మంటలలో ఆహుతిఅయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: