విశాఖ అందమైన నగరం. అందరూ మెచ్చే నగరం.ఇక్కడ ప్రశాంతంగా ఉండాలనుకుంటారు. ముఖ్యంగా ఇక్కడ పనిచేసిన అధికారులు కూడా కదిలి వేరే చోటకు వెళ్ళాలనుకోరు. ఇక వారు తమకూ విశాఖలో ఓ చోటు ఉండాలనుకుంటారు. ఇక విశాఖ ఆసియా ఖండంలోనే వేగంగా విస్తరిస్తున్న సిటీగా గుర్తింపు తెచ్చుకుంది.

 

అటువంటి విశాఖ ఎపుడో ప్రజల హ్రుదయాల్లో రాజధానిగా ఉంది. ఇక విశాఖలో భూ దందాలు జరుగుతున్నాయని అంటున్నారు. అయితే గత అయిదేళ్ళుగా కూడా భూ దందాలకు కొదవ లేదు. మంత్రుల స్థాయి వరకూ ఆరోపణలు వినిపించాయి.ఇక చంద్రబాబు సిట్ ని ఏర్పాటు చేసినా ఒక్క దోషి కూడా దొరకలేదు. ఇక వైసీపీ సర్కార్ విశాఖను రాజధాని చేస్తామని ప్రకటించింది. దాంతో దందాలు జగుతున్నాయని తమ్ముళ్ళు గగ్గోలు పెడుతున్నారు.

 

అదే విధంగా బీజేపీ నేతలు అంటున్నారు. అయితే దందాలు మీ హయాంలోనే జరిగాయని వైసీపీ నెతలు రివర్స్ అటాక్ చేస్తున్నారు. ఇంక వైపు విశాఖలో  విశాఖలో పులివెందుల బ్యాచులు తిరుగుతున్నాయట. అడ్డగోలుగా భూములు లాక్కుంటున్నాయట. దందాలు చేస్తున్నాయట. ఇవ్వకపొతే  జగన్ రెడ్డికి చెబుతామని కూడా బెదిరిస్తున్నాయట.

 

విశాఖలో ఖాళీ జాగా కనిపిస్తే కాటేస్తున్నారని,ఇందులో ఎన్నారైలు, ప్రముఖులు కూడా బలి అవుతున్నారని అంటున్నారు. ఇక బీజేపీ ఎమ్మెల్సీ పీవీ ఎన్ మాధవ్ కూడా ఇదే రకమైన ఆరోపణ చేస్తున్నారు. విశాఖలో భూ దందాలు మొదలయ్యాయని ఆయన అంటున్నారు. మరి ఇందులో నిజాలు ఎంత ఉన్నాయో వైసీపీ సర్కార్ దర్యాప్తు జరిపిస్తే తప్ప తెలియదు.

 

వైసీపీ విశాఖను రాజధాని చేయాలనుకుంటోంది. ఈ టైమ్ లో  ఇలాంటి ఆరోపణలు రావడం మంచిది కాదు. విశాఖలో అంతా కలసి ఉంటున్నారు. ప్రశాంతమైన జీవనం సాగిస్తున్నారు. అటువంటి చోట దందాలు మొదలుపెడితే ప్రజల్లో నెగిటివిటీ వస్తుంది. టీడీపీ మీద ఆ విధంగానే వ్యతిరేకత వచ్చింది. మొత్తం మీద టీదీపీ, బీజేపీ చేస్తున్న ఆరోపణలు కొట్టేయకుండా నిగ్గు తేల్చాలని అంతా కోరుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: