ప్రస్తుతం కరోనా వైరస్ సందర్భంగా లాక్ డౌన్ ఈ విధానాన్ని పాటించడంతో ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉంటూ వారి కుటుంబంతో పాటు ఇంట్లోనే ఉండి పనులు చేసుకుంటున్నారు. అయితే కొన్ని వర్గాలకు సంబంధించిన వారు మాత్రం అహర్నిశలు మనకోసం పాటుపడుతూనే ఉన్నారు. డాక్టర్లు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, కరెంటు ఆపరేటర్లు, మీడియా రంగం వారు వీరు బయట పరిస్థితి ఎలా ఉన్నా వారి జీవనాన్ని యథావిధిగా కొనసాగిస్తూ కరోనాకు ఎలాంటి భయపడకుండా వారి పనులు వారు నిర్వర్తిస్తున్నారు.


అయితే తాజాగా ముంబైలోని ఒక ప్రాంతంలో విధి నిర్వహణలో కరోనా బారిన పడిన వారిలో ఇద్దరు జర్నలిస్టులు కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. వారికి ఐసోలేషన్ వార్డులో ఉండేవి చికిత్స అందించిన అనంతరం వారి పరీక్షలు చేయగా ఇద్దరు జర్నలిస్టులకు రావడంతో వారు డిశ్చార్జి అవ్వడం జరిగింది. దీనితో వారి ఇద్దరు కరోనా ను జయించి హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అవ్వడం జరిగింది.

 


ఇలా వారు కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఇళ్లకు చేరుకున్న జర్నలిస్టులకు సియోన్ ( ముంబై లో) ప్రాంతంలోని ప్రతీక్ష నగర్ లో ఉన్న ప్రెస్ ఎంక్లేవ్ హౌసింగ్ సొసైటీ సభ్యులు వారిని ఘనంగా సత్కరించారు. నిజానికి వారు ఇంటికి వచ్చే సమయంలో క్షేమంగా తిరిగి వచ్చిన వారికి చప్పట్లతో ప్రశంసల వర్షం కురిపించారు. అయితే BMC నిర్వహించిన కరోనా పరీక్షలో మొత్తం 193 మంది జర్నలిస్టులకు ఫోటోగ్రాఫర్లకు పరీక్షలు చేయగా అందులో ఏకంగా 53 మందికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. దీనితో వారందరినీ చికిత్స నిమిత్తం హాస్పిటల్ లో జాయిన్ చేసి చికిత్స అందించారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: