ప్రపంచంలో చైనాలోని పుహాన్ నుంచి పుట్టుకు వచ్చిన కరోనా ఇప్పటి వరకు ఎన్నో అనర్దాలు సృష్టిస్తుంది.  ప్రపంచ దేశాల్లో ఎవరికీ కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.  అమెరికాలో 50 వేల మందికి పైగా మరణాలు సంబవించాయి.   వివిధ దేశాల్లో కరోనాని కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించారు.  అప్పటి నుంచి కరోనా ప్రబావం కొంత తగ్గుతుందని అంటున్నారు.  ఇక మన దేశంలో గత నెల నుంచి లాక్ డౌన్ విధించారు.   అయితే ఈ లాక్ డౌన్ ఇప్పటిది కాదు. 1866వ సంవత్సరంలో నిజాం-బ్రిటిష్ పాలన సమయంలో కూడా హైదరాబాద్ సంస్థానంలో ఓసారి లాక్ డౌన్ విధించారు. 

 

 అప్పట్లో కలరా, ప్లేగు వ్యాధులు హైదరాబాద్ సంస్థానాన్ని అతలాకుతం చేసాయి. దీంతో ఈ వ్యాధుల ప్రబలడాన్ని అరికట్టడానికి అప్పటి పాలకులు లాక్ డౌన్ విధించారు.  కాకపోతే అప్పట్లో ఇలాంటి విషయాన్ని లాక్ డౌన్ గా పేర్కొనలేదు.  కానీ, లాక్ డౌన్ సమయాన్ని ‘వేతనంతో కూడిన సెలవు, ప్రత్యేక సెలవు’గా పిలిచేవారు. కలరా, ప్లేగు వ్యాధులను నివారించడానికి, ప్రజల నైతిక స్థైర్యం, ఆరోగ్యాన్ని కాపాడడానికి ఈ ‘ప్రత్యేక సెలవు’ ఎంతో ఉపయోగపడుతుందని అప్పటి పాలకులు భావించారు. 

 

  అయితే అప్పట్లో రైలు, బండ్లు, ఓడల కారణంగా ఈ కలరా, ప్లేగు వ్యాధి ప్రబలుతుందని వాటిని కూడా బంద్ చేశారు. ప్రయాణానికి వాడుకునే వాటి ద్వారా ఈ వ్యాధులు ప్రబలుతున్నాయని గుర్తించిన అప్పటి పాలకులు వాటిని నిలిపివేశారు. ఇప్పట్లాగానే కంటైన్ మెంట్ జోన్లు, ఐసోలేషన్ ఆసుపత్రులు, ఎమర్జన్సీ స్పెషల్ పాసుల ఏర్పాట్లు చేశారు.  అప్పట్లో ఇలాంటి క్రమశిక్షణ తీసుకోవడం వల్ల అలాంటి అంటురోగాలు రాకుండా చాలా వరకు నయం చేసినట్లు చరిత్ర చెబుతుంది.  ఎమర్జన్సీ పాసులు ఉన్న వాళ్ళను మాత్రమే హైదరాబాద్ నగరంలోకి అనుమతించేవాళ్ళు. విచిత్రం ఏంటంటే అప్పట్లో వలస కూలీల వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అంటారు. ఇప్పుడు కూడా విదేశీయుల వల్లే ఎక్కువ కరోనా వ్యాప్తి చెందిందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: