ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుండి హైకోర్టులో సీఎంకు వరుసగా ఎదురుదెబ్బలే తగిలాయి. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టు ఆ నిర్ణయంపై వ్యతిరేక తీర్పు వచ్చింది. తాజాగా ఇంగ్లీష్ మీడియం విషయంలో కూడా కోర్టు జగన్ కు మరో షాక్ ఇచ్చింది. మోదీ అధికారంలోకి వచ్చిన కొత్తలో, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కొత్తలో వారికి కూడా కోర్టు నుంచి ఎదురుదెబ్బలే తగిలాయి. 
 
కానీ ఆ తరువాత మోదీ, కేసీఆర్ నిర్ణయాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కోర్టు నుంచి వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడ్డారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ పదవీకాలం తగ్గిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నిమ్మగడ్డ రమేష్ స్థానంలో కనగరాజ్ ఎన్నికల కమిషనర్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నిమ్మగడ్డ రమేష్ తనను అన్యాయంగా తొలగించారంటూ పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఈ పిటిషన్ గురించి హైకోర్టులో విచారణ జరగనుంది. సీఎం జగన్ నిమ్మగడ్డ రమేష్ విషయంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి జాగ్రత్త పడ్డారు. ఒక రకంగా జగన్ కు ఇది అగ్ని పరీక్ష అనే చెప్పాలి. జగన్ ఐదేళ్ల పదవీ కాలాన్ని మూడేళ్లకు తగ్గించడంపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. సోమవారం నిమ్మగడ్డ వేసిన పిటిషన్ గురించి ప్రభుత్వం వేసిన కౌంటర్ గురించి విచారణ జరగనుంది. 
 
హైకోర్టు ఈ కేసులో జగన్ కు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే మాత్రం హైకోర్టు తీర్పు జగన్ కు భారీ షాక్ అయ్యే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పు జగన్ కు అనుకూలంగా వస్తే ప్రతిపక్షాలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. జగన్ ఈ అగ్ని పరీక్షలో పాస్ అవుతాడో లేదో చూడాలంటే రేపటివరకు ఆగాల్సిందే. హైకోర్టు తీర్పు జగన్ భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: