గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వంలో ఎన్ని అక్రమాలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఇసుక, ల్యాండ్ మాఫియాలు, కాంట్రాక్టుల్లో వాటాలు ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీ నేతలు చేయని అరాచకాలు లేవు. ముఖ్యంగా జన్మభూమి కమిటీల పేరుతో మామూలు దోపిడి చేయలేదు. ఇక వాటితో విసుగెత్తిపోయిన ప్రజలు జగన్‌ని భారీ మెజారిటీతో గెలిపించారు. అయితే జగన్ పభుత్వం వచ్చాక టీడీపీ నేతలు వరుస పెట్టి విమర్శలు చేస్తూనే వస్తున్నారు.

 

ప్రస్తుతం కరోనాని కూడా రాజకీయంగా వాడేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరరావు, జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఊహించని భారీ డైలాగులు వేశారు. రాష్ట్రంలో సారా, గుట్కా, కైనీ, గంజాయి వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతోందని, ఇక లిక్కర్‌ కింగ్‌ ఉత్తరాంధ్రలోనే ఉన్నారు.

 

వైసీపీ నేతలు ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ వేల కోట్లు ఆర్జిస్తున్నారని ఓ హైలైట్ అయిన డైలాగ్ వేశారు. అసలు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో యరపతినేని చేసిన మైనింగ్, ఇసుక మాఫియా గురించి బాగా తెలుసని వైసీపీ నేతలు రివర్స్ పంచ్ వేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కాదంటున్నారు. అందుకే కదా ఆయనపై సి‌బి‌ఐ విచారణ కూడా పడిందని చెబుతున్నారు.

 

గుంటూరు జిల్లాలోని కోణంకి, కేసనుపల్లి, నదికుడి గ్రామాల్లో అక్రమ మైనింగ్‌కి పాల్పడ్డారని కూడా వార్తలు వచ్చాయి. మొత్తం మీద ఆయనపై 18 కేసులు ఉన్నవరకు ఉన్నాయి. ఇక అలాంటి నేత ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఇసుక మాఫియా జరుగుతుందని చెప్పడం కామెడీగా ఉందని అంటున్నారు.అదేవిధంగా టీడీపీ హయాంలో లిక్కర్ మాఫియాకు అంతులేదని, కానీ ఇప్పుడు ఆయన ప్రభుత్వంపై కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, మద్య నిషేధం దిశగా జగన్ పనిచేస్తుంటే, యరపతినేని అర్ధంపర్ధం లేని విమర్శలు చేస్తున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: