కరోనా వైరస్ దెబ్బకి మీడియా రంగం కూడా కుదేలవుతోంది. ప్రింట్ మీడియా అయితే సాధనకు క్లోజ్ అయిపోయే పరిస్థితికి వచ్చేసినట్లే. చాలా పత్రికలు ఎప్పటికీ కరోనా వైరస్ వల్ల భూత పడిపోయాయి. దీంతో ప్రస్తుతం అమలవుతున్న కొన్ని పత్రికలు పేజీలు తగ్గించుకుంటూ మరో పక్క సగం సగం జీతాలు ఉద్యోగస్తులకు ఇస్తూ రాణిస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇంటర్వ్యూ కి వెళ్లే జర్నలిస్టులకు దాదాపు ఇటీవల కరోనా వైరస్ సోకే సందర్భాలు వస్తున్న తరుణంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

 

ఇలాంటి టైమ్ లో తెలుగు మీడియా రంగంలో మరో సరికొత్త టీవీ ఛానల్ పెట్టడానికి రెడీ అవటం అనేది చిన్న విషయం కాదు. దాదాపు ప్రస్తుతం 16 కు పైగా శాటిలైట్ ద్వారా న్యూస్ ఛానల్స్ రన్ అవుతున్నాయి. ఇటువంటి తరుణంలో  సీనియర్ జర్నలిస్ట్ ఆకుల దినేష్ నేతృత్వంలో ఈ ఛానెల్ రాబోతున్నట్లు సమాచారం. పూర్తి మేటర్ లోకి వెళ్తే ఒక నేషనల్ ఛానల్ తన పరిధిలో అన్ని ప్రాంతాల్లో చానల్స్ ఉండాలని ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో తెలుగు మీడియా రంగంలో క్రియేట్ వర్క్ బాగా చేసే వ్యక్తిగా మీడియా సర్కిల్ లో దినేష్ పేరు గట్టిగా వినబడుతుంది. గతంలో టీవీ9, ఎక్స్ ప్రెస్ టీవీ, టీవీ 5 లలో కీలక స్థానాల్లో పని చేయడం జరిగింది.

 

వర్క్ విషయంలో మంచి పేరు సంపాదించడంతో.. జాతీయ ఛానల్ తెలుగు ప్రాంతంలో కొత్తగా పెట్టబోయే చానల్ బాధ్యత మొత్తం దినేష్ కి అప్పగించినట్లు మీడియా సర్కిల్స్ లో వినపడుతున్న టాక్. దీంతో కరోనా కారణంగా పనులు ఆగిపోవటంతో త్వరలో లాక్ డౌన్ కాలం కూడా పూర్తయ్యే అవకాశం ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రిక్రూట్మెంట్ ను నిర్వహించాలని దినేష్ అండ్ టీమ్ భావిస్తోంది. ఇప్పటికే ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉండాలి..? ఇన్ పుట్ మరియు అవుట్ పుట్ విభాగాలను ఏవిధంగా బలోపేతం చేసుకోవాలన్నదానిపై పూర్తి స్థాయి క్లారిటీతో దినేష్ ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: