నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు విజృంభించిన  కరోనా  వైరస్ ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. క్రమక్రమంగా తెలంగాణ రాష్ట్రంలో తక్కువ కేసులు నమోదవుతున్నాయి. కరోనా  వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య కూడా భారీగానే పెరుగుతుంది. అయితే కరోనా వైరస్  నేపథ్యంలో ప్రభుత్వం పై ఎక్కువ మొత్తంలో భారం పడుతుంది అన్న విషయం తెలుసిందే . ఎందుకంటే కరోనా  వైరస్ రోగులను చూసుకోవడం అంటే ఆషామాషీ కాదు. వారికి సరైన ఆహారం అందించడం బెడ్ ఛార్జీలను కట్టడం.. ఇలా చాలానే భారాన్ని మోస్తుంది ప్రభుత్వం. కానీ ప్రజల ప్రాణాలను కాపాడడానికి ప్రభుత్వాలు ఎంత ఖర్చు అయిన  భరించడానికి సిద్ధమవుతున్నాయి. 

 

 ఇదిలా ఉంటే తాజాగా కరోనా  వైరస్ గురించి ఎంఐఎం రాష్ట్ర శాసనసభ పక్ష నాయకుడు  ఓవైసీ రాజకీయన్ని  స్టార్ట్ చేశారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనికి సంబంధించి  తీవ్రమైన విమర్శలకు కాలు దువ్వుతున్నారు అని అంటున్నారు. అయితే మొదటి నుంచి ఓవైసీ కరోనా వైరస్ విషయంలో కాస్త సైలెంట్ గానే ఉన్నారు.తబ్లిక్  సమావేశాల నుంచి మాట్లాడకపోవడం... అంతేకాకుండా ప్రభుత్వం చేస్తున్న కరోనా  పోరాటంలో ఎలాంటి భాగస్వామ్యం ఇవ్వకపోవడం చేశారు. కానీ ప్రభుత్వం చేసిన కృషి ప్రయత్నాల కారణంగా అవన్నీ ఫలించి ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తగ్గు ముఖం పట్టింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 

 ఈ నేపథ్యంలోనే ఓట్ల రాజకీయం మొదలు పెట్టారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. గాంధీ ఆస్పత్రిలో కరోనా  వైరస్ రోగులకు చికిత్స  అందించేందుకు సరిగ్గా సదుపాయాలు లేవు అంటూ అంశాన్ని లేవనెత్తి విమర్శలకు దిగుతున్నారు. కరోనా  వైరస్ పేషెంట్లను జైల్లో ఖైదీలలాగా  చూస్తున్నారు అంటూ ఆరోపణ చేస్తున్నారు . ఉదయం మధ్యాహ్నం రాత్రి ఎంత పౌష్టికాహారం పెట్టడంతోపాటు సాయంత్రం సమయంలో స్నాక్స్ కూడా డ్రైఫ్రూట్స్ లాంటివి ఇచ్చింది ప్రభుత్వం. అంతేకాకుండా కరోనా  వైరస్ బారినపడి చికిత్స పొంది ఆ తరువాత కోలుకొని బయటకు వచ్చిన వారు కూడా రోగుల విషయంలో ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు అంటూ చెబుతున్నారు. కానీ ప్రస్తుతం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎలాంటి భావ దారిద్ర్యం మనకి పెద్ద సమస్యగా మారింది అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: