ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా  వైరస్ విజృంభిస్తున్న  నేపథ్యంలో.. ప్రజలందరూ సామాజిక దూరం పాటించాలని... దీనికోసం అధికారులు రాజకీయ నాయకులు అందరూ ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం సూచనలు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రజలు సామాజిక దూరం పాటించేలా ఇంటికే పరిమితం అయ్యేలా రాష్ట్రంలో లాక్ డౌన్  ప్రకటించింది ప్రభుత్వం. అయితే అంతేకాకుండా కరోనా నేపథ్యంలో   ఎంతో మంది రాజకీయ నాయకులు కూడా ఎలాంటి గందరగోళ పరిస్థితులు  సృష్టించవద్దని సభలు నిర్వహించాలని అంతేకాకుండా ప్రజలు గుమి గూడేల  ఏ పని చేయొద్దు సూచిస్తోంది. ఏ పని చేసిన సామాజిక దూరం తప్పనిసరి అంటూ  సూచనలు చేస్తుంది జగన్ సర్కార్. 

 

 అయితే ఇలాంటి నేపథ్యంలో శ్రీకాకుళంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. అది కూడా స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే స్పీకర్ తమ్మినేని సీతారాం తన స్వచ్ఛంద సంస్థ ద్వారా పేద ప్రజలకు సమాగ్రి,  నిత్యవసరాలు  పంపిణీ చేపట్టారు. అయితే ఇది మంచి కార్యక్రమం అయినప్పటికీ దీని కోసం ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం పై  మాత్రం రాజకీయ విశ్లేషకులు తప్పుబడుతున్నారు. 

 


 ఈ బహిరంగ సభలో ఒక్కొక్కరికి ఒక కుర్చీ మధ్య దూరం పెట్టినప్పటికీ ఆ కుర్చీలో మధ్యలో ఉన్న స్థలంలో మిగతావాళ్లు కూర్చున్నారు. అదేంటి అంటే మాస్కులు పెట్టుకున్నారు కదా అంటున్నారు. మాస్క్ లు పెట్టుకున్నంత మాత్రాన కరోనా  రాకుండా పోతుందా అని ప్రశ్నిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.మాస్క్  పెట్టుకుంటే ఏంటి షేక్ హ్యాండ్ చేసుకోవడం ద్వారా కూడా ఒకరి నుంచి ఒకరికి కరోనా  వైరస్ పాకుతుంది. అయితే శ్రీకాకుళంలో కరోనా  వైరస్ ప్రభావం లేదు అన్న ధైర్యంతో బహిరంగ సభ పెట్టారా లేదా... మరేదైనా కారణం కావచ్చు కానీ పోలీసులు ఈ బహిరంగ సభకు ఎలా అనుమతిస్తున్నారు అన్న దానిపై మాత్రం రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. అధికారం తమ చేతిలో ఉంది కాబట్టి అక్కడి అధికారులు కూడా ఏమీ నోరు మెదపలేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఒకవేళ కరోనా  వైరస్ ఉన్న వ్యక్తి అలా భారీ బహిరంగ సభ లోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది  అని ఆలోచిస్తే బాగుంటుంది అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: