కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీగానే ఉంది. అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉందని అంటున్నారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మహమ్మారిని ఎప్పటికీ కంట్రోల్ చేయకుంటే ప్రపంచవ్యాప్తంగా  25 మిలియన్లు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని, తక్షణమే నియంత్రించ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా రెండున్నర కోట్ల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పోతాయని ILO తెలిపింది. 1930 నాటి ఆర్థిక మాన్యం పరిస్థితులు మళ్లీ తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ప్రభుత్వాలు, బ్యాంకులు, సంస్కరణలు చేపట్టేందుకు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటాయి అని ఓ నివేదికలో వెల్లడించింది.

 

ఆస్ట్రేలియా నుండి అమెరికా వరకు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉందని ఈ సంస్థ తెలిపింది. ఇక భారతదేశం విషయానికి వస్తే ఐటీ రంగంలో కూడా చాలావరకు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మొబైల్ మార్కెట్ అన్ని రంగాల కంటే ఎక్కువగా నష్టపోవటం గ్యారెంటీ అని ఆర్ధిక విశ్లేషకులు అంటున్నారు. లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే సరికొత్త పన్ను విధానం వలన దేశంలో మొబైల్ మార్కెట్ తీవ్రంగా దెబ్బతింటుందని అంటున్నారు.

 

చాలావరకు సెల్ ఫోన్ రేట్లు లాక్ డౌన్ తర్వాత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెప్పుకొస్తున్నారు.  అలాగే సెల్ ఫోన్ విడిభాగాల పై కేంద్రం విధించిన జిఎస్టి టాక్స్ అదేవిధంగా  ఇప్పటివరకూ సెల్ ఫోన్ల దిగుమతులపై ఉన్న 12శాతం జీఎస్టీ.. ఏప్రిల్-1 నుంచి 18 శాతానికి పెంచడంతో ఈ నిర్ణయాలు మొబైల్ రంగాన్ని పూర్తిగా డేంజర్ జోన్లోకి నెట్టేసినట్లయింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple.

 

మరింత సమాచారం తెలుసుకోండి: