తగ్గుముఖం పడుతుందనుకుంటున్న కేరళలో కరోనా పూర్తిగా అదుపులోకి రావడానికి మరి కొన్ని రోజుల సమయం పట్టేలేనా వుంది. నిన్న కొత్తగా మరో 11కేసులు నమోదయ్యాయి. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 468 కు చేరింది. అందులో ప్రస్తుతం 123 కేసులు యాక్టీవ్ లో ఉండగా  342 మంది కోలుకున్నారు. ముగ్గురు మరణించారు. కేరళ వ్యాప్తంగా మరో  మూడు హాట్ స్పాట్ లను గుర్తించామని దాంతో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ స్పాట్ ల సంఖ్య  87కు చేరిందని సీఎం విజయన్ వెల్లడించారు. 
 
ఇక తెలుగురాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ లో నిన్న మరో 11 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1001 కు చేరింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో నిన్న 81 కేసులు నమోదు కావడం తో  మొత్తం కేసుల సంఖ్య 1097 కు చేరింది. ముఖ్యంగా కృష్ణ లో  నిన్న ఒక్క రోజే 52 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఇదిలావుంటే రేపు ప్రధాని నరేంద్ర  మోడీ, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో  జరిపే వీడియో కాన్ఫరెన్స్ పైనే అందరి చూపు వుంది. ఈ సమావేశంలో లాక్ డౌన్ పై ఎక్కువగా చర్చించనున్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర , పశ్చిమ బెంగాల్  తదితర రాష్ట్రాలు లాక్ డౌన్ ను మరో సారి పెంచాలని ప్రధానిని కోరనున్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ గా ఇండియాలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య  27000  దాటింది. గత మూడు రోజుల నుండి 1600 కు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: