ప్రపంచంలో వచ్చిన సాంకేతిక విప్లవం మనుషుల్ని పూర్తిగా మార్చేసింది.. ఇంకా మార్చేస్తుంది కావచ్చూ.. ఇప్పటికే యావత్ ప్రపంచం సరికొత్త టెక్నాలజీ యుగంలోకి ప్రవేశించింది.. తొలి పారిశ్రామిక విప్లవానికి యంత్ర పరికరాల ఉత్పాదన, నాంది కాగా.. రెండో పారిశ్రామిక విప్లవానికి విద్యుదుత్పత్తి, వినియోగం దారి తీసింది. ఆపై మూడో విప్లవానికి 20వ శతాబ్దం మధ్యకాలం నుంచి కంప్యూటర్లు, ఇంటర్నెట్, డిజిటల్ టెక్నాలజీలు కారణమవగా మనుషుల జీవితాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి..

 

 

ఇక రోబోటిక్స్, బిగ్ డేటా అండ్ అనలిటిక్స్, కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తదితర న్యూ టెక్నాలజీల అభివృద్ధి, నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని ఆవిష్కరించాయి. అదీగాక యాక్సెంచర్ నివేదిక ప్రకారం 2035 నాటికి కృత్రిమ మేధస్సు పూర్తిగా అవతరించేందుకు అవకాశముంది.. అప్పటి వరకు మనిషిలా ఆలోచించి, నిర్ణయాలు తీసుకునే రోబోలు, యంత్రాలు, కంప్యూటర్లను అభివృద్ధి చేసే శాస్త్రసాంకేతిక విజ్ఞానం అందుబాటులోకి వస్తుంది.. ఇప్పటికే దీనిపై రిసెర్చ్‌లు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.. ఇదిలా ఉండగా ప్రస్తుత పరిస్దితుల్లో ప్రపంచాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్న కరోనా వైరస్ నిర్మూలనలో వేసే అడుగులు మొదటిదశలోనే ఉన్నాయి.. అందుకే ఈ వైరస్ సోకిన పేషెంట్లకు ట్రీట్‌మెంట్ చేస్తున్న వైద్య సిబ్బంది కూడా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న దీనిబారిన పడుతున్నారు..

 

 

అందుకే కొన్ని దేశాలు ఈ విషయంలో మరమనుషుల సహాయం తీసుకుని ముందుకు వెళ్లుతున్నాయి.. ఇందులో భాగంగా కరోనాకు పుట్టిళ్లు అయినా చైనాలో ఈ వైరస్ కట్టడికి రోబోలను విస్తృతంగా వాడారు. ముఖ్యంగా రోడ్లను, అపరిశుభ్ర ప్రాంతాలను శానిటైజ్‌ చేయడానికి అత్యాధునిక మరయంత్రాలను వినియోగించారు. అంతే కాకుండా రోగులకు ఆహారం, మందులు సరఫరా చేయడానికి, గదులు శుభ్రం చేయడానికి, అలాగే రోగ నిర్ధారణ, థర్మల్‌ స్క్రీనింగ్‌కూ, వంటలు వండటానికి కూడా ఈ రోబోలు అక్కడి వారికి సహాయపడ్డాయి. ఇదే కాకుండా కొన్ని రోబోలు యూవీ కిరణాలను ప్రసరింపజేసి వైరస్‌లను నిర్మూలిస్తాయి.

 

 

ఇలాంటి రోబోలను చైనాలోనే కాకుండా అమెరికా, ఇటలీ, థాయ్‌లాండ్, మలేషియా‌ వంటి దేశాలలో కూడా ప్రస్తుతం ఈ రోబోలను వాడుతున్నారు.. మనుషులు ఎలాగో సోషల్ డిస్టెన్స్ పాటించరు.. కాబట్టి ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధుల విషయంలో రోబోల సహాయం తీసుకుంటే కొంతవరకైనా మేలుజరగవచ్చూ.. ఇప్పటికే మనదేశంలో కొన్ని చోట్ల వాడుతున్నారు కానీ పూర్తిస్దాయిలో రోబోలను ఉపయోగిస్తే కరోనా బారిన పడకుండా కొంతమంది వైద్య సిబ్బందినైన కాపాడవచ్చూ.. 

మరింత సమాచారం తెలుసుకోండి: