దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామాన్య ప్రజలు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరికీ వ్యాపిస్తూ అందరిలో ప్రాణ భయాన్ని కలిగిస్తుంది ఈ మహమ్మారి వైరస్. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ఈ మహమ్మారి వైరస్ బారినపడి చికిత్స తీసుకున్న వారు ఉన్నారు.సామాన్య ప్రజల పరిస్థితి అయితే మాటల్లో చెప్పలేనిది. రోజురోజుకు ఎంతో మంది ఈ మహమ్మారి వైరస్ బారినపడి పడి ఐసోలేషన్ వార్డుకే  పరిమితమై మృత్యువుతో పోరాడుతున్నారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా భయాన్ని  ప్రజల నుంచి తరిమి కొట్టి... అవగాహన కల్పించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా పై  కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి ఉన్నంత అవగాహన మరే  ఇతర నేతకూ లేదు అనడంలో అతిశయోక్తి లేదు. 

 

 

 కానీ విచిత్రం ఏమిటంటే... భారత ప్రజలందరికీ కరోనా  వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్లుప్తంగా వివరిస్తూన్న  కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయంలోనే కరోనా  చొరబడింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్దన్  కార్యాలయంలో ఓ ఎస్ డి ఆఫీసర్ గా నియమింపబడిన ఉద్యోగి కి కరోనా  పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయ సిబ్బంది సదరు వ్యక్తిని వెంటనే క్వారంటైన్  కు పంపించారు  తాత్కాలికంగా కార్యాలయాన్ని మూసివేస్తూన్నట్లు తెలిపారు. అంతకు ముందుగా హర్షవర్ధన్ దేశంలో క్రమక్రమంగా కరోనా  పరిస్థితి మెరుగ్గా ఉందని చాలా హాట్ స్పాట్ జిల్లాలో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు వచ్చాయి అంటూ తెలిపారు. 

 

 

 అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా తక్కువ కొత్త కేసులు నమోదు అవుతున్నాయని దీనికంతటికీ ప్రభుత్వం అమలు చేసిన లాక్ డౌన్ చేపడుతున్న చర్యలు కారణం అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మాత్రం ఎలాంటి క్వారంటైన్  విధించు కోలేదు. ఎందుకంటే సదరు ఓఎస్డి ఎప్పుడూ ఆరోగ్యశాఖ మంత్రి ని కలిసింది లేదు. కాగా ఆరోగ్యశాఖ మంత్రి ఆఫీస్ ను మళ్ళీ తిరిగి ఎప్పుడు ఓపెన్ చేస్తారు అన్నది మాత్రం స్పష్టం చేయలేదు. ఆఫీస్ మొత్తం పూర్తిగా శుభ్ర పరిచిన తర్వాత అక్కడ కరోనా వైరస్ లేదు అని నిర్ధారించిన తర్వాత కార్యాలయం మళ్లీ తెరిచే  అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దేశ ప్రజలందరికీ కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకునే సలహాలు సూచనలు ఇస్తున్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి... ఇక తన కార్యాలయంలో సిబ్బంది విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా  సోకడం నిజంగా ఆశ్చర్యకరమే.

మరింత సమాచారం తెలుసుకోండి: