దేశంలో గత నెల మొదలైన కరోనా వ్యాప్తి ఇప్పుడు ప్రళయరూపం దాల్చింది.  మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు మరికొన్ని రాష్ట్రల్లో బీభత్సంగా విజృంభిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.  అయితే కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ లాక్ డౌన్ మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఇక తెలంగాణలో మాత్రం మే 7 వరకు లాక్ డౌన్ ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.  తాజాగా తెలంగాణలో లాక్ డౌన్ పటిష్టంగా అమలవుతుందని అందుకే కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని ముఖ్యమంత్రి కేసిఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

 

ప్రజలు లాక్ డౌన్ కు సహకరించి, ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు పాటిస్తే కరోనా వ్యాప్తి నిరోధానికి పరిస్థితి మెరుగవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవాళ అన్ని రాష్ట్రాల సీఎంలతో జరిగే ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో తర్వాత భవిష్యత్ కార్యాచణపై నిర్ణయం ఉంటుందని చెప్పారు.  కొన్ని చోట్లు లాక్ డౌన్ ఉల్లంఘిస్తున్నారని.. అది సమాజానికే ప్రమాదం అని అలాంటి వారు గుర్తించాలని సూచించారు.  లాక్ డౌన్ ఉల్లంఘిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని అన్నారు.

 

ఇవాళ అన్ని రాష్ట్రాల సీఎంలతో జరిగే ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో తర్వాత భవిష్యత్ కార్యాచణపై నిర్ణయం ఉంటుందని చెప్పారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు తీరు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. లాక్ డౌన్ ను మరికొంత కాలం ఇదే పద్ధతిలో కొనసాగిస్తే, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే రాబోయే రోజుల్లో వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గిపోయి కరోనాని జయించినట్టే అని కేసీఆర్ అన్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: