ప్రపంచ లోనే ఎక్కువగా కరోనా ప్రభావానికి గురైన సిటీ అమెరికాలోని న్యూయార్క్. కరోనా దెబ్బకు అందమైన  న్యూయార్క్ అతలాకుతలం అయ్యింది. ఆ ఒక్క సిటీలోనే ఇప్పటివరకు 280000  కరోనా కేసులు నమోదు కాగా 15000కు పైగా మరణాలు సంభవించాయి.  ప్రస్తుతం లాక్ డౌన్ లో వున్న న్యూయార్క్ లో  ఇప్పుడిప్పుడే  పరిస్థితి  అదుపులోకి వస్తుంది. కొత్త కేసులు తగ్గముఖం పడుతున్నాయి. అలాగే మరణాలు కూడా తగ్గుతున్నాయి. ఇక న్యూయార్క్ లో మే 15 నుండి దశల వారిగా లాక్ డౌన్ ఎత్తివేయనున్నారని సమాచారం. ఓవరాల్ గా  ఇప్పటివరకు  అక్కడ 800000 టెస్టులు చేశారు అలాగే అమెరికా వ్యాప్తంగా  ఇప్పటివరకు 900000కు పైగా కరోనా కేసులు నమోదు కాగా 50000 కరోనా మరణాలు సంభవించాయి. 
 
ఇక మిగితా దేశాల విషయానికి వస్తే ఇటలీ మే 4నుండి దశల వారిగా లాక్ డౌన్ ను ఎత్తివేయనుండగా జోర్డాన్  మే 23 వరకు లాక్ డౌన్ ను పొడిగించింది అలాగే యూకే,ఐర్లాండ్ , నెదర్లాండ్స్ ,మాత్రం ఎలాంటి సడలింపులు లేకుండా లాక్ డౌన్ ను కొనసాగించనున్నాయి. ఇక ఇండియా విషయానికి వస్తే  మే 3వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. ఇప్పటికే కేంద్రం పలు మినహాయింపులు కూడా ఇచ్చింది.
 
అయితే రోజు రోజు కు కరోనా కేసులు పెరుగుతుండడం తో లాక్ డౌన్ ను మరి కొన్ని రోజులు పొడిగించాలని కొన్ని రాష్ట్రాలు కోరుతున్నాయి. ఈ పొడిగింపు విషయంలో ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశాలు వున్నాయి. ఇప్పటివరకు ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 27892 కు చేరగా  అందులో 872 మంది మరణించారు. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ , గుజరాత్ , రాజస్థాన్ , మధ్యప్రదేశ్ లో  కరోనా ప్రభావం అధికంగా వుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: