లాక్ డౌన్ పొడిగింపు , కరోనా నియంత్రణ పై ఈ రోజు  రాష్ట్ర ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చర్చించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ను మరో సారి పెంచాలని పట్టుబట్టగా.. మిగితా రాష్ట్రాలు కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశాయి. ఇక మోదీ కూడా మరో సారి లాక్ డౌన్ ను పొడిగించేందుకే మొగ్గు చూపుతున్నారని సమాచారం. మే 31 వరకు లాక్ డౌన్ ను కొనసాగించి ఆతరువాత మరో సారి పొడిగించేందుకు వీలులేకుండా చేయాలని మోదీ భావిస్తున్నారట.
 
అయితే ఎన్ని రోజులు పొడిగిస్తారో స్పష్టత లేకపోయిన పొడిగింపు మాత్రం ఖాయమని తెలుస్తుంది. ఇప్పటికే అమలువుతున్న రెండో దశ లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు ఇచ్చిన కేంద్రం మూడో దశ లాక్ డౌన్ లో కూడా మరి కొన్ని మినహాయింపులకు ఓకే చెప్పనుంది. అందులో ముఖ్యంగా మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేట్లు కనిపిస్తుంది. తాజాగా జరిగిన సమావేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు మద్యం అమ్మకాలకు పర్మిషన్ ఇవ్వాలని  కోరినట్లు తెలుస్తుంది. కేంద్రం కూడా అందుకు సానుకూలంగా ఉందని సమాచారం. మద్యం కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆదాయం విషయంలో రాష్ట్రాలకు ఎంతో కొంత ఊరట కలుగనుంది. 
 
అయితే ప్రజా రవాణా విషయంలో మాత్రం మరోసారి నిరాశేమిగలనుంది. విమాన సర్వీసులతోపాటు రైల్వే , బస్సు సర్వీసులను మరోసారి నిలిపివేయాలని కేంద్రం భావిస్తుంది. ఇక వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు తరలించే విషయాన్ని కూడా కేంద్రం పరిశీలిస్తుంది. అయితే  ఏ మినహాయింపు ఇచ్చిన అవి హాట్ స్పాట్ , రెడ్ జోన్ల కు వర్తించే ఛాన్స్  లేదు. మరి కొన్ని రోజులు ఆ ఏరియా ల్లో పూర్తిగా లాక్ డౌన్ ను కొనసాగించాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: