కరోనా కారణంగా ప్రజలంతా ఎంతో ఆందోళన చెందుతున్నారు. కొత్తగా ఎక్కడ, ఎన్ని కేసులు బయటపడతాయో అని బెంబేలెత్తిపోతున్నారు. తమ ప్రాంతాలకు సంబంధించి ఏ వార్త వచ్చినా ఉలిక్కి పడిపోతున్నారు.  కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా విషాదాలే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు లాక్‌డౌన్‌తో చిత్ర విచిత్ర ఘటనలు కూడా జరుగుతున్నాయి. ఓవైపు వదంతులు కూడా తోడు అవడంతో ప్రజల్లో, అటు అధికారుల్లో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది.  మరోవైపు  కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో కరోనా కారణంగా ఓ వ్యక్తి మరణించాడని అధికారులు ఈనెల 25న విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు.

 

మరుసటి రోజు ఆయన మరణవార్త పత్రికల్లో కూడా వచ్చింది. దీంతో, సదరు బాధితుడు తాను చనిపోలేదని, బతికే ఉన్నానని నిరూపించుకోవాల్సి వచ్చింది. తాను బతికే ఉన్నానంటూ అధికారులను సచ్చీచెడి నమ్మించే పరిస్థితి నెలకొంది. బతికుండగానే చంపేస్తారా? అని మండిపడ్డాడు. తాను చనిపోలేదు మొర్రో, బతికే ఉన్నానని చెప్పాడు. అంతటితో ఆగకుండా తాను బతికే ఉన్నానని నిరూపించుకోవాల్సి వచ్చింది అంతే కాదు అది కాస్త ఓ వీడియో షూట్ చేసి మరి వాళ్లను నమ్మించాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ఆ విడియో కాస్త వైరల్ కావడంతో తమ తప్పును అధికారులు గ్రహించారు. వెంటనే తమ తప్పు సర్ధుకున్నారు. 

 

ఈ సందర్భంగా ఉజ్జయిని చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్సుయా గవాలి మాట్లాడుతూ... పేరు, అడ్రస్ లో పొరపాటు కారణంగా ఇది జరిగిందని చెప్పారు. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.  ప్రస్తుతం డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ద్య  కార్మికులు ఎంతో గొప్పగా తమ విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో చిన్న నిర్లక్ష్యం ఓ వ్యక్తి నానా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కి వచ్చిందని అందరూ విమర్శిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: