ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఏ విధంగా అతలాకుతలం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ మహమ్మారిని అరికట్టేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనేక రకాల చర్యలు తీసుకుంటున్న కూడా పాజిటివ్ కేసుల సంఖ్య అదుపులోకి రావడం లేదనే చెప్పాలి. ముఖ్యంగా మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. అంతే కాకుండా మరో వైపు లాక్ డౌన్ అమలుతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వలస కార్మికులు కూడా రోజువారీ ఆహారం తీసుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పాలి. 

 


ఇక మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబైలో కూడా అధిక సంఖ్యలో కేసులు నమోదు అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన బారిన పడినవారికి ఎటువంటి వైద్య సేవలు అందుతున్నాయి  లేదో  అన్న సందేహంతో ఒక మేయర్ వినూత్న రీతిలో ఒక హాస్పిటల్ ని సందర్శించడం జరిగింది. అంతే కాకుండా అక్కడి వైద్య సిబ్బందిని ప్రోత్సహించడం జరిగింది. ఇక BMC ఆధ్వర్యంలో లో వైద్య సేవలు అందిస్తున్న నాయర్ ఆస్పత్రిని ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ నర్స్ యూనిఫాంలో సందర్శించడం జరిగింది. అలాగే కరోనా వైరస్ బారినపడి వారిని కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్న వైద్య సిబ్బందిని ప్రోత్సహించడం తోపాటు వారి సేవలకు మద్దతు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆస్పత్రిలో సామాజిక దూరం ఖచ్చితంగా పాటించాలి అంటూ రోగులకు వైద్య సిబ్బందికి తెలియజేశారు. 

 


ఇక మేయర్... నేను కూడా నర్సుగా పనిచేశాను. అలాగే వృత్తిపరంగా ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటామని కూడా నాకు తెలుసు. అందుకోసమే మళ్లీ నేను నర్స్ యూనిఫాంలో వచ్చి నేను కూడా వైద్య సిబ్బందిలో ఒక భాగమే అని సందేశాన్ని ఇవ్వాలని అనుకున్నాను. అంతేకాకుండా ఈ మహమ్మారిపై పోరాడేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్య సిబ్బందికి తెలియజేయడం జరిగింది అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: