ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో కరోనా వైరస్ చాపకింద నీరులాగా విజృంభిస్తుంది అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు అనే చెప్పాలి. దేశవ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడి చాలామంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పాలి. అలాగే మరోవైపు లాక్ డౌన్ అమలుతో సాధారణ మధ్యతరగతి కుటుంబాలు అయితే అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఇక ఈ మహమ్మారిని అరికట్టడం కోసం నిత్యం వైద్య సిబ్బంది కృషి చేస్తూనే ఉంది. 

 


ఈ తరుణంలో తాజాగా కరోనా వైరస్ తో పోరాడిన సబ్ ఇన్స్పెక్టర్ హర్జిత్ సింగ్ పూర్తిగా వైరస్ నుంచి బయటపడినట్లు పంజాబ్ సీఎంవో తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా హార్జిత్ సింగ్ కు వైద్య సేవలు అందించిన పీజీఐ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాకుండా సీఎంవో హార్జిత్ సింగ్ చేయి ముందులాగే బాగా పనిచేస్తుంది అని తెలిపారు. ఈ విషయాన్ని సీఎంవో సోషల్ మీడియా వేదికగా చేసుకొని ట్విట్టర్ లో తెలియజేయడం జరిగింది.


ఇక అసలు విషయానికి వస్తే లాక్ డౌన్ సమయంలో పంజాబ్ లోని పటియాల జిల్లా సనౌర్ పట్టణంలో విధులు చేపడుతున్న హర్జిత్ సింగ్ చెయ్యిని సిక్కులలోని ఒక వర్గం వారు కత్తితో నరకడం జరిగింది. వెంటనే హుటాహుటిగా ఆయనను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ కు తరలించడం జరిగింది.  అక్కడ వైద్య సిబ్బంది దాదాపు ఎనిమిది గంటలపాటు సర్జరీ చేసి చేయిని తిరిగి మళ్లీ అతికించారు. ఇక ఆ వీడియోలో హార్జిత్ మాట్లాడుతూ... చివర్లో జైహింద్ అని సెల్యూట్ కూడా చేయడం జరిగింది.  

 


ఇక మరోవైపు హర్షిత్ సింగ్ కు సంఘీభావం తెలుపుతూ పంజాబ్ రాష్ట్ర పోలీసు అధికారులు అందరూ కూడా ప్రత్యేక ప్రదర్శన చేపట్టడం జరిగింది. అలాగే వారి ఖాకీ యూనిఫాం లపై హార్జిత్ సింగ్ లను బ్యాడ్జ్ కూడా ధరించి ప్రత్యేక ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 'మే భీ హర్జీత్ సింగ్' అని పేరు కూడా పెట్టడం జరిగింది. ఏది ఏమైనా కానీ చివరకి హర్జిత్ సింగ్ కోలుకోవడం అందరికీ ఒక సంతోషకరమైన విషయమే అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: