దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. ప్రతిరోజు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కరోనాను జయించడం సాధ్యమా...? సాధ్యం కాదా....? అనే ప్రశ్నకు మానసిక శక్తిని పెంచుకుంటే కరోనాను జయించడం సాధ్యమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
నిపుణులు, శాస్త్రవేత్తలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా కరోనా సంబంధిత రోగులకు జలుబు, జ్వరం, పొడి దగ్గు ఇతర లక్షణాలు ఉంటాయి. ఎవరైతే మానసిక బలాన్ని పెంచుకుంటారో వారు సులభంగానే కరోనాను జయించవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మన దేశంలో ప్రజల్లో ఇతర దేశాలతో పోలిస్తే మానసిక బలం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
ఎవరైతే కరోనా భారీన పడతారో వారు ఆందోళనకు గురి కాకుండా ఉంటే కరోనాను జయించడం అసాధ్యమేమీ కాదని చెబుతున్నారు. మానసిక ధైర్యంతో కరోనాను జయించడం సాధ్యమవుతుంది. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో మృతుల సంఖ్య తక్కువగా ఉండటానికి కూడా మానసిక బలమే కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశం గురించి మరిన్ని పరిశోధనలు జరపాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
మరోవైపు దేశంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 28380కు చేరింది. ఇప్పటివరకు 6362 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 886 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. తెలంగాణ రాష్ట్రంలో 1001 కేసులు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1177 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 25 మంది కరోనా భారిన పడి మృతి చెందగా ఏపీలో 35 మంది మరణించారు.                                   

మరింత సమాచారం తెలుసుకోండి: