ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. భూగోళమంతా ఆ మహమ్మారి నుంచి బయటపడేందుకు అలుపెరగని పోరాటం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని అంతం చేసే సంజీవిని లాంటి మందు వైద్యులకు దొరికినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మందు క్రిటికల్ కండిషన్ లో ఉన్న వాళ్ళకి ఆశలు చిగురింప చేసే విధంగా ఫలితాలు తీసుకో వస్తుందట. యావత్ ప్రపంచం మొత్తం దృష్టి ఇప్పుడు ఈ మందు పై పడింది. మందు మరొకటి ఏమిటో కాదు ప్లాస్మా థెరపీ. అసలు ఈ ప్లాస్మా థెరపీ విధానం చూస్తే కరోనా వైరస్ నుండి కోరుకున్న వ్యక్తి దగ్గర నుండి రక్తాన్ని సేకరిస్తారు ఆస్పెరిస్ విధానం ద్వారా రక్తం నుండి ప్లాస్మా ను వేరు చేస్తారు.

 

మిగిలిన రక్త కణాలు మళ్లీ దాత శరీరంలోకి వెళ్లిపోతాయి. ఒక డోనర్ నుంచి 800 మిల్లీ లీటర్ వరకు ప్లాస్మా తీయవచ్చు. అయితే ఒక్కో కరోనా బాధితుడికి 200 మిల్లీ లీటర్ ల ప్లాస్మా అవసరం అవుతోంది. అలా ఒక్క వ్యక్తి నుంచి సేకరించిన ప్లాస్మా తో నలుగురికి చికిత్స అందించవచ్చు. వైరస్ వచ్చి డిశ్చార్జి అయినా వారి దగ్గర నుంచి 14 రోజులు కోలుకున్న తరువాత ప్లాస్మా ను తీసుకుంటారు. రక్తాన్ని తీసుకొని రెడ్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్ ను వేరు చేస్తారు. ఇక మిగిలి ఉన్న దాన్ని ప్లాస్మా అంటారు. రక్తంలో నీటి రూపంలో కనిపించే పసుపు రంగు ద్రవమే ప్లాస్మా. శరీరంలో ప్రవేశించే బాక్టీరియా మరియు వైరస్ నీ చంపే యాంటీబాడీలు ఇందులో ఉంటాయి.

 

శరీరంలో ఉన్న వైరస్ కణాలను తెల్ల రక్త కణాలను గుర్తించేందుకు రోగనిరోధక వ్యవస్థ ఈ యాంటీబాడీలను తయారు చేస్తుంది. కరోనా వైరస్ నుంచి కోరుకున్న వ్యక్తి బాడీలో ఈ యాంటీబాడీస్ ఉంటాయి. ఈ యాంటీబాడీలు వైరస్ కణాలకు అతుక్కుని ఉన్నా వైరస్ కణాలను తెల్ల రక్త కణాలు గుర్తించి నాశనం చేస్తాయి. అందుకే కరోనా బారినపడి పూర్తిగా కోలుకున్న వ్యక్తి నుంచి ప్లాస్మా నీ తీసే చికిత్స విధానాన్ని నేటి రాష్ట్రంలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. చాలావరకూ ప్లాస్మా విధానం ద్వారా సత్ఫలితాలు వస్తున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: