ప్రపంచం అంతా కరోనాతో వణికిపోతుంటే.. ఆ దేశం మాత్రం తీపికబురు చెప్పింది.. తీపికబురంటే మనకు పనికి వచ్చే కబురు కాదు.. ఆదేశంలో నివసిస్తున్న వారికి మాత్రమే దీని వల్ల ఉపయోగం.. ఎందుకంటే ప్రపంచంలో దాదాపుగా ఎక్కడ ఊహించనటువంటి శిక్షలు ఆ దేశంలో వేస్తారు.. అక్కడ ఉన్న న్యాయాధికారులకు పాపపుణ్యాలతో పనిలేదు.. నేరం చేస్తూ దొరికిన వారి పని అయిపోయినట్లే.. మనదేశంలో లాగ కోర్టు, జైలు అంటూ దోషులను నెలలు, సంవత్సరాలు పోషించడం ఉండదు.. చంపడమే అదీ కూడా కౄరంగా, ఆ చావులు చూస్తే ఇంకెవరు కూడా సాధ్యమైనంత వరకు తప్పుచేయాలంటే భయంతో చచ్చిపోతారు..

 

 

ఇంకా అర్ధం కాలేదా ఇదేం దేశమో.. అయితే చెబుతా వినండి.. ఆదేశం పేరే సౌదీ అరేబియా.. ఈ దేశంలో శిక్షలు ఎంత కఠినంగా అమలవుతాయో మనం ఇదివరకే చాలా సార్లు వార్తల్లో చదివే ఉంటాం.. అలాంటి ఈ దేశం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.. అదేమంటే మైనర్లుగా ఉన్నప్పుడు చేసిన నేరాలకు ఇకపై సౌదీ అరేబియా మరణశిక్ష విధించబోదని ఆ దేశ మానవ హక్కుల కమిషన్ తెలిపింది. ఈ మేరకు సౌదీ రాజు సల్మాన్ ఉత్తర్వులు జారీచేసినట్లు పేర్కొంది.. ఈ నేపధ్యంలో మైనర్లుగా ఉండగా చేసిన నేరాలకు మరణ శిక్షకు బదులుగా బాల నేరస్థుల నిర్బంధ కేంద్రంలో గరిష్ఠంగా పదేళ్ల పాటు తప్పుచేసిన బాలలను ఉంచేలా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది..

 

 

ఇకపోతే ‘మానవ హక్కుల సంస్కరణల్లో భాగంగా కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ మరియు అతని కుమారుడు క్రౌన్ ప్రిన్స్.. తప్పుచేసిన వారిని కొరడాతో కొట్టడాన్ని కూడా శనివారం రద్దు చేశారు. అది చేసిన మరుసటి రోజే బాలనేరస్థులకు మరణ శిక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే మరిన్ని సంస్కరణలు అమలులోకి వస్తాయి’ అని అవద్ అలవాద్ అన్నారు.. ఇక 2019వ సంవత్సరంలో సౌదీ అరేబియా రికార్డు స్థాయిలో అంటే 189 మందికి మరణ శిక్షలు అమలు చేసిందని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంటోంది. అంతటి కౄరంగా ప్రవర్తించే సౌదీలో ఇప్పుడిప్పుడే మార్పులు సంభవించడం ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం.. మరి ఈ నిర్ణయం వల్ల వచ్చే ఫలితాలను అక్కడి రాజు ఎలా స్వీకరిస్తారో చూడాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: