రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి ఏపీ ఆర్ధిక పరిస్థితులు అంతంత మాత్రమే అన్న సంగతి తెలిసిందే. తర్వాత చంద్రబాబు అప్పులతో ఇంకా పరిస్థితి దిగజారింది. ఇక ఇప్పుడు కరోనా వల్ల లాక్ డౌన్ ఉండటంతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దిగజారిపోయింది. అయితే ఎలాంటి పరిస్థితి ఉన్న సీఎం జగన్ ప్రజలకు అండగానే ఉంటూ, వారికి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు.

 

కష్టమున్న ప్రజలని ఆదుకుంటూనే ఉన్నారు. ఇక ఇలాంటి సమయంలోనే జగన్ కు మరో కష్టం వచ్చి పడింది. రాష్ట్రాన్ని అకాల వర్షాలు ముంచెత్తాయి. దీని వల్ల వేల ఎకరాల పంట నష్టం జరిగింది. ఇక చేతికొచ్చే పంట చేజారిపోవడంతో రైతులు, సాయం కోసం ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. అయితే అకాల వర్షాల వల్లే కాకుండా కొన్ని చోట్ల వరిపోలాలకు సరైన సమయంలో నీరందక, గిట్టుబాటు ధర దొరకక కూడా రైతులు నష్టపోయారు.

 

ఇదే విషయంపై పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పోరాటం కూడా చేస్తున్నారు. తాజాగా ఆయన... ధాన్యం రైతులు, రొయ్యల రైతులు పూర్తిగా నష్టపోయారని వారిని ఆదుకునే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టుకి లేఖ రాశారు. అటు హైకోర్టు కూడా ఆ లేఖను సుమోటోగా స్వీకరించి విచారణ చేసి, అధికారులతో కమిటీ వేసి రైతులతో మాట్లాడి పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

 

ఇక ఈ పరిస్థితుల్ని డీల్ చేసేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. అకాల వర్షాలు వల్ల 8,314 హెక్టార్ల పంట నష్టం జరిగిందని, రైతుల్ని ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. అలాగే తడిసిన ధ్యానం కొనుగోలు చేసేందుకు కేంద్రం అనుమతి తీసుకోవాలని, ఆ ప్రయత్నం కూడా చేస్తున్నామని, రైతులకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే ఆక్వా రైతుల్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నామని, వీలైనంత వరకు కోల్డ్ స్టోరేజ్ లు పెంచే ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్నారు. మరి చూడాలి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వం రైతుల్ని ఏ మేర ఆదుకుంటుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: