ప్రపంచ వ్యాప్తంగా కరోనా భయం పట్టుకుంది. ఎటు చూసిన కూడా కరోనా మాటనే వినపడుతుంది..రోజు రోజు కూ కరోనా వల్ల చాలా మంది మృత్యువాత పడుతున్నారు.. మరీ కొందరు మాత్రం కరోనా కారణంగా  క్వారంటైన్ లో బాధపడుతున్నారు.. ఇకపోతే కరోనా కట్టడి లో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ పేరుతో ప్రజలను ఇళ్లకే పరిమితం అయ్యేలా చేసింది.. అయినా కూడా కరోనా ప్రభావం ఎక్కడా తగ్గలేదు.. 

 

 

 

 

 

 

 

కరోనా మహమ్మారిని ఇంట్లోనే ఉంటూ కట్టడి చేయాలని చాలా మంది అనుకుంటున్నారు..అయితే ఈ మేరకు సినీ ప్రముఖులు కూడా అభిమానులకు సూచనలు ఇస్తూ ప్రజలను ఆకర్షించడానికి సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తూ వస్తున్నారు.. అయితే లాక్ డౌన్ తప్పక పాటిస్తే ఎటువంటి భాధలు ఉండవని తెలియ పరుస్తున్నారు.. 

 

 

 

 

 

 

ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు శుభ‌వార్త తెలిపింది వైఎస్ జ‌గ‌న్ స‌ర్కార్‌. ఏప్రిల్ నెల పింఛ‌న్‌ను పూర్తి మొత్తంలో చెల్లించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. కాగా, ఏప్రిల్ పించ‌న్ చెల్లింపు ప్ర‌క్రియ మే నెల‌లో జ‌రుగుతుంద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. వీటికి సంబంధించిన అధికారిక ఉత్త‌ర్వుల‌ను ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్వి నీలం సాహ్ని జారీ చేశారు. లాక్‌డౌన్ వంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో .. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని.., ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు, పింఛ‌న్‌దారుల‌కు మార్చి నెల‌లో స‌గం మొత్త‌మే చెల్లించిన సంగ‌తి తెలిసిందే. 

 

 

 

 

 

మే నెల‌లో పూర్తి మొత్తాల‌ను చెల్లించేలా  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స‌రికొత్త ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో వైద్య ఆరోగ్యశాఖ, పోలీసుశాఖలోని అధికారులు సిబ్బందితోపాటు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని పారిశుద్ధ్య సిబ్బందికి ఏప్రిల్‌ నెలకు సంబంధించి పూర్తి వేతనాలు అందనున్నాయి. మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులు, గెజిటెడ్‌ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులకు మే నెలలోనూ సగం జీతమే చెల్లించేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇక‌, నాలుగో తరగతి ఉద్యోగులు, ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందికి ప‌ది శాతం మినహాయించి మిగిలిన మొత్తాలు చెల్లిస్తారు. అలాగే,హోంగార్డులు, వార్డు, గ్రామ వాలంటీర్లకు పూర్తి వేతనం అంద‌నుంది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అందే మొత్తంలో పూర్తిగా కోత అమల్లో ఉండ‌నుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: