తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అశోక్ గజపతిరాజు ఓ వెలుగు వెలిగారు. కేంద్ర మంత్రిగా రాణించారు. విజయనగరం జిల్లాలో ఎప్పటినుండో పూసపాటి రాజ కుటుంబానికి మంచి పేరు ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు నుండే పూసపాటి వంశానికి చెందిన వాళ్ళు పరిపాలన విషయంలో గానీ ధర్మకర్త్వత్వం విషయంలో గాని రాచ కుటుంబం పూసపాటి 80 ఏళ్లుగా విశిష్ట సేవలు విజయనగరం వాసులకు అందజేస్తూ వస్తోంది. ముఖ్యంగా ఈ రాజకుటుంబానికి సెంటిమెంట్ సింహాచలంలో అప్పన్న స్వామి. ఈ వంశానికి చెందిన వాళ్ళు అప్ప్పన్నకు ప్రధాన సేవకులు. తొలి పూజ వారే చేయాలి. వారే స్వామి వారి ఆలయ తలుపులు తీసి అర్చన చేయాలి. అటువంటి రాచ కుటుంబం పూసపాటి వారిది. వైసిపి పార్టీ అధికారంలోకి రాకముందు వరకు  అశోక్ గజపతిరాజు సారధ్యంలో సారథ్యంలోనే పూజలు జరిగాయి.

 

అయితే ఈ ఏడాది అధికారంలో వైసీపీ పార్టీ ఉండటంతో మార్చిలో వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో మాజీ కేంద్ర మాంత్రి అశోక్ గజపతిరాజు ఛైర్మెన్ గిరీ ఒక్కసారిగా పోయింది. ఆ స్థానంలో అశోక్ గజపతిరాజు అన్న ఆనందగజపతిరాజు పెద్ద కుమార్తె సంచయిత గజపతిరాజుకి చైర్ పర్సన్ పగ్గాలు అప్పగించారు. ఇలాంటి పరిస్థితుల్లో సింహాచలం లో అప్పన్న స్వామి ముఖ్యమైన పండుగ చందనోత్సవం నీ ధర్మకర్త హోదాలో ఉన్న వాళ్ళు వైభవంగా జరుపుతారు. అది వైశాఖ మాసంలో అక్షయ తృతీయ నాడు వస్తుంది. ఆ రోజున స్వామి వారు నిజ రూప దర్శనంలో భక్తులకు కనిపిస్తారు. ఈ వేడుకలకు ధర్మకర్త హోదాలో ఉన్నవారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి తొలి పూజ చేస్తారు. గతంలో అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా జరిగింది.

 

అయితే తాజాగా ధర్మకర్త హోదాలో సంచయిత గజపతిరాజు ఉండటంతో ఈసారి కరోనా వైరస్ రావటంతో కేవలం సంచయిత గజపతి రాజు ఆధ్వర్యంలోనే పూజలు జరిగాయి. ఈ పూజలకు విఐపిలను ఇతర భక్తులను ఎవరినీ అనుమతించలేదు. కరోనా దెబ్బతో అశోక్ కుటుంబం కూడా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఒకపక్క రాజకీయంగాను మరోపక్క రాజ కుటుంబ పరంగా రావాల్సిన గౌరవ విషయంలో అన్నిటిలో అశోక్ గజపతిరాజు పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతున్న ఈ క్రమంలో ఆయనని ఆదుకునే నాధుడు ఎవరో అని విజయనగరం వాసులు తెగ చర్చించుకుంటున్నారు. ఇలాంటి సందర్భం ఎప్పుడూ కూడా రాకపోవడంతో చందనోత్సవం సమయంలో స్వామివారి దర్శనం కలగక పోవడంతో సామాన్య భక్తులు కూడా మరోపక్క  తెగ బాధపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: