కేరళలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 13 కొత్త కేసులు నమోదయ్యాయి. అందులో  కొట్టాయంలో 6, ఇడుక్కి 4 కేసులు నమోదు కాగా పలక్కాడ్, మల్లపురం, కన్నూర్ లో ఒక్కో కేసు నమోదైంది. అయితే వారం రోజుల క్రితమే కొట్టాయం ,ఇడుక్కి జిల్లాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించగా తాజాగా ఆ ప్రాంతాల్లో నే కేసులు ఎక్కువ అవ్వడం గమనార్హం. ఇక ఈ 13 కేసుల తో కలిపి కేరళ లో మొత్తం కేసుల సంఖ్య 481కు చేరగా అందులో ప్రస్తుతం 123 మాత్రమే యాక్టీవ్ గా వున్నాయి. కాగా 355 మంది పూర్తిగా కోలుకోగా ముగ్గురు మరణించారు. ఇక ఈ రోజు ప్రధాని మోదీ తో జరిగిన సమావేశానికి కేరళ సీఎం విజయన్  హాజరుకాకపోవడం చర్చనీయాంశం అయ్యింది. 
ఇదిలావుంటే దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజు కు పెరుగుతూనే ఉంది. నిన్న ఒక్క రోజే 1500 కు పైగా కేసులు నమోదు కావడం తో మొత్తం కేసుల సంఖ్య  29500 కు చేరింది. అందులో 850కు పైగా మరణాలు సంభవించాయి. మరోవైపు  వచ్చే నెల 3తో దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ముగియనుంది. అయితే కేసుల సంఖ్య ఎక్కువవుతుండడం తో కేంద్రం లాక్ డౌన్ ను పొడిగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మే 3 న లాక్ డౌన్ పై ప్రకటన వెలుబడనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: