ఒకపక్క ప్రజలంతా లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతూ ఉంటే ప్రభుత్వాలు మాత్రం చాలా కీలకమైన విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ఇబ్బందులను మరికొద్దిగా పెంచుతున్నారు. మొన్న చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలను కాపాడాల్సిన నాయకులే ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించి కరోనా వ్యాప్తికి కృషి చేయగా ఇప్పుడు చూస్తే తెలంగాణ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యపు తీరు చాలా ఆందోళనకరంగా తయారయింది.

 

విషయం ఏమిటంటే మూడు రోజులకు ఒకసారి కెసిఆర్ ప్రెస్ మీట్ పెట్టి తన పదునైన మాటలతో మరియు సెటైర్లతో మీడియా వాళ్ళ నోర్లు మూయించడం అలవాటుగా చేసుకున్నాడు. కానీ తన రాష్ట్రంలో మాత్రం కరోనా నివారణ చర్యల విషయంలో అస్సలు ప్రభావం చూపలేకపోయాడు అన్నది వాస్తవం. తెలంగాణలో మొదటి కరోనా వైరస్ కేసు నమోదయ్యే ఇప్పటికీ 40 రోజులు పైనే కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో ఇప్పటివరకు చేసిన కరోనా నిర్ధారణ టెస్టులు ఎన్ని అంటే మీడియా వారి రిపోర్టుల ప్రకారం 23,000.

 

సరే అవి అన్ని తప్పుడు లెక్కలు.... మేము ఇంకా భారీగా టెస్టులు నిర్వహించాం అని ప్రభుత్వం అయినా ఒక అఫీషియల్ స్టేట్ మెంట్ ఇచ్చిందా అంటే అదీ లేదు. అంతెందుకు రోజున తెలంగాణలో జరిగిన కరోనా నిర్ధారణ టెస్టుల సంఖ్య అక్షరాలా 159. అవే టెస్టులు తమిళనాడులో రోజుకి 7000.. ఆంధ్రలో 6500.. మహారాష్ట్రలో 5000 కర్ణాటకలో 2500 నిర్వహించారు. తెలంగాణ ప్రజలంతా మన రాష్ట్రంలో పాజిటివ్ కేసులు తక్కువ నమోదు అవుతున్నాయి ఇక కొద్ది రోజుల్లో మేం లాక్ డౌన్ నుండి బయటపడబోతున్నాం అని లోలోపల సంబరపడుతుంటే.. దాని వెనుక దాగున్న అసలు నిజం ఇది. అసలు టెస్టులు చేస్తే కదా ఎవరికి పాజిటివ్.... ఎవరెవరు సేఫ్ అని తెలిసేది.

 

ప్రభుత్వం ఇలాగే కరోనా నిర్ధారణ టెస్టులు నిర్వహించకుండా జాప్యం చేస్తే మాత్రం పాజిటివ్ ఉన్నవారంతా కరోనా వ్యాప్తిని డబుల్ ట్రిపుల్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక విషయం తెలిసిన వారంతా వైరస్ అంటే మీకు ఆటలు అయిపోయిందా అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: